ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్లకు మట్టి కూడా వేయలేని అసమర్థ ప్రభుత్వం: పల్లె

ABN, First Publish Date - 2022-08-08T05:33:37+05:30

రోడ్లు వేయలేని అసమర్థతతో వైసీపీ పాలన ఉందని, కనీసం రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చలేనిస్థితిలో సీఎం జగన ఉన్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి విమర్శించారు.

టీడీపీలో చేరుతున్న వైపీపీ నాయకులతో మాజీ మంత్రి పల్లె
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


టీడీపీలోకి పలువురు వైపీపీ నాయకుల చేరిక

బుక్కపట్నం, ఆగస్టు 7: రోడ్లు వేయలేని అసమర్థతతో వైసీపీ పాలన ఉందని, కనీసం రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చలేనిస్థితిలో సీఎం జగన ఉన్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి విమర్శించారు.  మండల పరిధిలోని కొత్తకోట గ్రామ పంచాయతీలో ఆదివారం వైసీపీకి చెందిన దాదాపు 58 కుటుంబాలు మాజీమంత్రి పల్లెరఘునాథరెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఈ సందర్భంగా పల్లె మాట్లాడుతూ.... టీడీపీ ప్రభుత్వంలో రోడ్లు వేస్తే ఆ రోడ్లపై పడిన గుంతలను పూడ్చలేని స్థితిలో వైసీపీ ఉందని దుయ్యబట్టారు. వైసీపీ హయాంలో మద్యం ఏరు లై పారుతోందని, వాటి ధర విపరీతంగా పెంచి ప్రజల నడ్డివిరుస్తు న్నారని అన్నారు. అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెంచడమే కాకుండా రాష్ట్రాన్ని అప్పులమయం చేశా రని విమర్శించారు. రాష్ట్రంలో ఒక వ్యక్తిపై రూ.2.75లక్షలు అప్పుల భారం మోపిందన్నారు. ప్రజా సంక్షేమం ముసుగులో అభివృద్ధి మరచి రాష్ట్రాన్ని అధోగతి పట్టించారన్నారు. వైసీపీ పాలనపై ప్రజలు విసిగిపోయారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చిన చంద్రబాబునాయుడును సీఎం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. అనంతరం పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ...పల్లె చేస్తున్న సేవా కార్యక్రమాలపై ఆకర్షితులమై తాము పార్టీలోకి చేరామన్నారు. వైసీపీలో కష్టపడే వారికి సముచి తం స్థానం లభించలేదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ మలిరెడ్డి, నాయకులు వెంకటనారాయణరెడ్డి, తెలుగుయువత చంద్ర, మీసాల మురళి, సయ్యద్‌బాషా, సామకోటి ఆదినారాయణ, గంగాధర్‌,  వెంకటరాముడు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-08T05:33:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising