ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లక్షలు వెచ్చించినా... అందని రక్షిత నీరు

ABN, First Publish Date - 2022-01-26T06:01:21+05:30

‘మన బడి, నాడు-నేడు’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు సురక్షిత నీరు అందించేందుకు కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రూ. లక్షలు ఖర్చు చేసి నీటిని శుద్ధి చేసే యంత్రాలు అమర్చారు.వాటిని అమర్చి ఆరు నెలలు కూడా కాకుండానే నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.

నిరుపయోగంగా ఉన్న నీటిని శుద్ధి చేసే యంత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


- ఆదర్శ పాఠశాలలో 

  పనిచేయని నీటి శుద్ధి యంత్రం

- ఇంటి వద్ద నుంచే 

  తెచ్చుకుంటున్న విద్యార్థులు

రాప్తాడు, జనవరి 25: ‘మన బడి, నాడు-నేడు’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు సురక్షిత నీరు అందించేందుకు కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రూ. లక్షలు ఖర్చు చేసి నీటిని శుద్ధి చేసే యంత్రాలు అమర్చారు. వాటిని అమర్చి ఆరు నెలలు కూడా కాకుండానే నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.  ఈ పరిస్థితి రాప్తాడు ఆదర్శ పాఠశాలలో నెలకొంది.రాప్తాడు ఆదర్శ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకూ దాదాపు 400 మంది విద్యార్థులు, ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దాదాపు 100 మంది ఉన్నారు. మొత్తం ఆ పాఠశాలలో 500 మంది విద్యార్థులు న్నారు. రాప్తాడు ఆదర్శ పాఠశాలలో రూ. 46లక్షలు ఖర్చు చేసి మరమ్మతులు, అభివృద్ధి పనులు చేశారు. అందులో భాగంగా పా ఠశాలలోని విద్యార్థులకు సురక్షిత నీరు అందించేందుకు రూ. 4.లక్షలు విలువ గల నీటిని శుద్ధి చేసే యంత్రాన్ని అమర్చారు. గతేడాది ఆగస్టులో అధికారులు, ప్రజా ప్రతినిధులు దీన్ని ప్రారంభించారు. కొన్నాళ్లు విద్యార్థులకు సురక్షిత నీరు అందించారు. ఆ తరువాత నీటిని శుద్ధి చేసే యంత్రం నిరుపయోగంగా మారింది. ఆ యంత్రం ఉన్న గదికి తాళం కూడా వేశారు. పాఠశాలలో సురక్షిత నీరు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు ఇంటి వద్ద నుంచే బాటిళ్లలో నీరు తెచ్చుకుంటున్నారు. దాదాపు నెల రోజుల నుంచి నీటిని శుద్ధి చేసే యంత్రం పనిచేయలేదని, అందుకే ఇంటి వద్ద నుంచే నీరు తెచ్చుకుంటున్నామని విద్యార్థులు చెబుతున్నారు. ఈ విషయంపై పాఠశాల ప్రిన్సిపాల్‌ పద్మజాదేవిని వివరణ కోరగా సంక్రాంతి సెలవులకు ముం దు నుంచి యంత్రంలోని ఓ పైపు నుంచి నీరు అధికంగా కారుతూ వృథా అవుతుండడంతో సురక్షిత నీరు అందించలేదన్నారు. పైపు మరమ్మత్తులు చేసే వ్యక్తిని సంప్రదించామని... రెండు రోజుల్లో సమస్య పరిష్కరించి విద్యార్థులకు సురక్షిత నీరు అందిస్తామన్నారు. 

Updated Date - 2022-01-26T06:01:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising