ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన దసరా శరన్నవరాత్రి వేడుకలు

ABN, First Publish Date - 2022-10-07T05:19:59+05:30

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. జిల్లావ్యాప్తంగా అమ్మవారి ఆలయాలు కిటకిటలాడాయి.

పెనుకొండలో జమ్మిచెట్టుకు భక్తుల ప్రదక్షిణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లేపాక్షి, అక్టోబరు 6: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. జిల్లావ్యాప్తంగా అమ్మవారి ఆలయాలు కిటకిటలాడాయి. లేపా క్షిలోని దుర్గా వీరభద్రస్వామి ఆలయంలో పదిరోజులు అమ్మవారికి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించారు. బుధవారం అమ్మవారిని మహిషాసురమర్దినిగా అలంకరించారు. దర్శనానికి భక్తులు క్యూకట్టారు. అనంత రం ఉత్సవవిగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించారు.

 

మడకశిర రూరల్‌: మండలవ్యాప్తంగా దసరా ఉత్సవాలు అంబరాన్నం టాయి. ఆయా గ్రామాల్లో జమ్మిచెట్టుకు విశేష పూజలు చేశారు. నీలకంఠాపురంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి దంపతులు ఊరేగింపుగా వెళ్లి జమ్మిచెట్టుకు ప్రదక్షిణ చేశారు. జమ్మానిపల్లిలో నిడమామిడమ్మను ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. 


ఆకట్టుకున్న జంబూసవారీ  

పెనుకొండ: రాయల వేసవి విడిది అయిన పెనుకొండలో పూర్వకాలం నుంచి దసరా ఉత్సవాలకు ప్రత్యేకత కొనసాగుతోంది. ఉత్సవమూర్తులను జంబూసవారీపై ఊరేగించి, పూజలు చేస్తారు. ఉత్సవాల్లో భాగంగా పురాత న ఆలయమైన వెంకటరమణస్వామి, వాసవీ కన్యకాపరమేశ్వరీ, ఉజ్జయిని మహంకాళీ, పులేకమ్మ ఆలయాల్లో అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించా రు. ఇళ్లలో బొమ్మల కొలువు ఏర్పాటుచేసి దుర్గాదేవిని పూజించారు. ఉత్స వాల చివరిరోజు జంబూసవారీపై దేవతల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కర్ణాటకలోని మైసూరు దసరా ఉత్సవాల్లో నిర్వహించే ఈ జం బూసవారీ ఉత్సవాన్ని పెనుకొండలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోం ది. పూర్వం పట్టణంలోని 365 ఆలయాల్లోని ఉత్సవ విగ్రహాలను జంబూసవారీతో పట్టణంలో అంగరంగ వైభవంగా ఊరేగించేవారని చెబుతారు. ప్ర స్తుతం పలు ఆలయాలు శిథిలావస్థలో ఉండగా, 50కిపైగా విగ్రహాలను వి జయదశమి రోజు రాత్రి పురవీధుల్లో బ్యాండు మేళాలు, మంగళవాయిద్యా లు, కోలాటం, కళాప్రదర్శనలు, బాణసంచా పేల్చుతూ ఊరేగించారు. పట్ట ణ నడిబొడ్డున ఉన్న జమ్మిచెట్టుకు ప్రదర్శనలు చేసి తిరిగి ఆయా ఆలయాలకు ఉత్సవ విగ్రహాలు చేరుకున్నాయి. ముందుగా కాళీమాత బయలుదేర గా, ఆఖరుగా ఉజ్జయిని మహంకాళీ ఊరేగింపతో ఉత్సవాలు ముగుస్తాయి. ఊరేగింపును తిలకించేందుకు పెనుకొండ, చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిగా జనం తరలివచ్చారు. సీఐ కరుణాకరణ్‌, ఎస్‌ఐ రమే్‌షబాబు ఆ ధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. 


గోరంట్ల: విజయదశమి సందర్భంగా గుమ్మయ్యగారిపల్లి మారెమ్మ ఆలయంలో ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ సేవా సమితి ఆధ్వర్యంలో 90 మంది గ్రామ పంచాయతీ కార్మికులకు రామ్మోహనరెడ్డి, నాగమల్లీశ్వరి దం పతులు వస్త్రదానం చేశారు. అర్చకులు దేవీస్వామి ఆధ్వర్యంలో అన్నదా నం కొనసాగింది. భక్తుల తాకిడితో ఆలయం కోలాహలంగా మారింది.


సోమందేపల్లి: మండలవ్యాప్తంగా అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను గ్రా మాల్లో ఊరేగించారు. సోమందేపల్లిలో చౌడేశ్వరీదేవి, అంబా భవానీ, పెద్ద మ్మ ఆలయాల్లో ఉదయం నుంచే భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. కన్యకాపరమేశ్వరీ ఆలయంలో అమ్మవారిని వెండి కవచంతో విశేషంగా అ లంకరించి, పూజలు చేశారు.


పెనుకొండ రూరల్‌: మండలంలోని పలు గ్రామాల్లో వెలసిన దుర్గామాత, ఆంజనేయస్వామి ఆలయాల్లో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరిం చి, పూజలు నిర్వహించారు. భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు.


అగళి: మండలంలోని కొమరేపల్లి బీరలింగేశ్వరస్వామి, నరసంబూది ల క్ష్మీరంగనాథస్వామి, అగళి శంకరేశ్వరస్వామి ఆలయాల్లో విజయ దశమి వే డుకలు ఘనంగా జరిగాయి. స్వామివార్లను ఊరేగించారు. మధూడి వీరభద్రేశ్వరస్వామి, రంగనాథస్వామిలను బుధవారం రాత్రి ఊరేగించారు. శుక్రవారం అగ్నిగుండ మహోత్సవం, శనివారం రథోత్సవాలను నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. జడ్పీటీసీ ఉమేష్‌ ఎద్దులబండిలో జంబుసవారీ చేపట్టారు. గ్రామాల్లో ఉత్సవాలు వెల్లివిరాసాయి. 


మడకశిర టౌన: పట్టణంలోని పావగడ రోడ్డులో వెలసిన చంద్రమౌళేశ్వరస్వామి, వెంకటేశ్వరస్వామి, బోగ రామలింగేశ్వరస్వామి, రామలింగేశ్వరస్వామి, షిర్డీసాయిబాబా, అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను భక్తజన కోలాహలం నడుమ ఊరేగించారు.


గుడిబండ: మండలంలో దసరా పండుగ సందర్భంగా ఇళ్లలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దేవాలయాల్లో స్వామిఅమ్మవార్ల ను దర్శించుకున్నారు. వాహనాలను అలంకరించి జంబూసవారీ చేపట్టారు.


రొళ్ల: మండలంలోని జీరగాళమ్మ జాతరకు జనం పోటెత్తారు. రత్నగిరి కొల్హాపురి లక్ష్మీదేవి,  హొట్టేబెట్ట వెంకటేశ్వరస్వామి, మల్లినమడుగు మహాలక్ష్మీ అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు, విశేష పూజలు చేశారు.


పావగడ: పట్టణంలోని గురు భవనం సమీప శమీ వృక్షం వద్ద విజయదశమి వేడుకలు అంబరాన్నంటాయి. పట్టణ వ్యాప్తంగా ఉన్న పురాతన  విగ్రహాలను, దుర్గామాతను పురవీధుల్లో ఊరేగిస్తూ శమీవృక్షం వద్ద ప్రద క్షిణ చేశారు. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. తహసీల్దార్‌, తాలూకా కార్యాలయ సిబ్బంది ఊరేగింపుగా వచ్చి, శమీ వృక్షం వద్ద పూజలు చేశా రు. వేలాదిగా పట్టణ ప్రజలు తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు.


హిందూపురం అర్బన: పట్టణంలోని కన్యకా పరమేశ్వరీ ఆలయంలో అమ్మవారిని మంగళగౌరిగా అలంకరించారు. తమిళనాడు కళాకారుల మ హిషాసుర మర్దిని వేషధారణ విశేషంగా ఆకట్టుకుంది. నానెప్ప నగర్‌ గా యత్రి దేవి ఉత్సవ విగ్రహానికి నగరోత్సవం నిర్వహించారు. మండలంలోని కెంచనపల్లి సప్పలమ్మ, కాటమయ్యలకు విశేషపూజలు చేశారు. అనంతరం ముత్యాల పల్లకిలో ఊరేగించారు. త్యాగరాజునగర్‌ కాళికామాతను ప్రత్యే కంగా అలంకరించారు. మంగళవాయిద్యాలతో మహిళలు ఊరేగింపుగా వ చ్చి, జ్యోతులు సమర్పించారు. కీర్తనలు, భజనలు స్తుతించారు. 

Updated Date - 2022-10-07T05:19:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising