ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంతలకు గుప్పెడు మట్టి వేయరా?

ABN, First Publish Date - 2022-07-18T06:04:10+05:30

‘నన్ను గెలిపించండి. మీ సమస్యలు పరిష్కరిస్తాం అంటే నమ్మి ఓట్లేశాం. గెలిచి మూడేళ్లయింది. నేటికీ మమ్మల్ని పట్టించుకున్న నాథుడే లేడు. కాలనీ ప్రధాన రోడ్డుకు మోకాలిలోతు గుంతలు పడ్డాయి.

కాలనీ రోడ్డు గుంతల్లో నిండుకున్న వర్షపు నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణమ్మ కాలనీవాసుల మొర 


పెనుకొండ రూరల్‌, జూలై 17: ‘నన్ను గెలిపించండి. మీ సమస్యలు పరిష్కరిస్తాం అంటే నమ్మి ఓట్లేశాం. గెలిచి మూడేళ్లయింది. నేటికీ మమ్మల్ని పట్టించుకున్న నాథుడే లేడు. కాలనీ ప్రధాన రోడ్డుకు మోకాలిలోతు గుంతలు పడ్డాయి. గంపెడు మట్టి కూడా వేయరా?’ అంటూ పట్టణంలోని నారాయణమ్మ కాలనీ వాసులు వాపోతున్నారు. కాలనీ మీదుగా కోనాపురం, మంగాపురం రహదారి దయనీయంగా మారింది. ఓట్లేసినందుకు మాకు బాగా బుద్ధి చెప్పారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పెనుకొండ నుంచి నారాయణమ్మకాలనీ మీదుగా కోనాపురం, మంగాపురం గ్రామాల ర హదారి గుంతలమయమైంది. కురుస్తున్న వర్షాలకు గుంతల్లో నీరు చేరాయి. దీంతో ఈ రహదారిలో ప్రయాణించాలంటే నరకం చూస్తున్నామని గ్రామస్థులు వాపోతున్నారు. టీడీపీ హయాంలో తమ ఊరికి రోడ్డు మంజూరైంది. పనులు మొదలయ్యేలోగా ఎన్నికలు రావడంతో అర్ధాంతరంగా ఆగిపోయింది. ప్రభుత్వం మారడంతో రోడ్డు పనులు అటకెక్కాయి. ఈరోడ్డును ఎప్పుడు వేస్తారంటూ నిలదీస్తున్నారు. రోడ్డు పనులు ప్రారంభించకపోయినా, కనీసం మోకాలిలోతు గుంతలకు మట్టి అయినా వేయండి అంటూ కాలనీవాసులు వేడుకుంటున్నారు.


Updated Date - 2022-07-18T06:04:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising