ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమ కేసులకు భయపడొద్దు

ABN, First Publish Date - 2022-08-13T05:41:44+05:30

రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, వాటికి భయప డాల్సిన అవసరం లేదని, అండగా తాము ఉంటామని టీడీపీ నాయకులు, కార్యకర్తలకు మాజీ మంత్రి పల్లెరఘ నాథరెడ్డి భరోసా ఇచ్చారు.

మాట్లాడుతున్న మాజీ మంత్రి పల్లె రఘనాథరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ కార్యకర్తలకు పల్లె భరోసా

పుట్టపర్తిరూరల్‌, ఆగస్టు 12 :  రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనను ప్రశ్నించిన వారిపై అక్రమ  కేసులు బనాయిస్తున్నారని, వాటికి భయప డాల్సిన అవసరం లేదని, అండగా తాము ఉంటామని టీడీపీ నాయకులు, కార్యకర్తలకు మాజీ మంత్రి పల్లెరఘ నాథరెడ్డి భరోసా ఇచ్చారు.  శుక్రవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాల యంలో పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచె రువు, మండలాల నాయకులు, కార్యక ర్తలతో నిర్వహించిన సమావేశంలో టీడీపీ సభ్యత్వ నమోదు, పార్టీ వివిధ కమిటీల కూర్పు తదితర వాటిపై సుదీర్ఘంగా చర్చించారు. ఏమైనా సమస్య లుంటే నేరుగా తన దృష్టికి తేవాలన్నారు. ప్రతికా ర్యకర్త రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలగు దేశంపార్టీ గెలుపే ఽధ్యేయంగా పనిచేద్దామన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చంద్రబాబే ముఖ్యమంత్రి కావాల్సిన ఆవస్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతికార్య కర్తపై ఉందన్నారు.  

  కార్యక్రమంలో కన్వీనర్లు విజయ్‌కు మార్‌, రామకృష్ణ, మల్లిరెడ్డి, ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు కొత్తపల్లి జయప్రకాష్‌, బీటీ నాయుడు, నాయకులు శ్రీరామిరెడ్డి, బొ మ్మయ్య, బొంతలపల్లి సర్వంచ శ్రీనివాసులు, కప్పలబండ సర్పంచు పెద్దన్న, నాగరాజు, జగన, శ్రీనివాసులు, రామయ్యశెట్టి, లెక్కలగోపాల్‌, మహేష్‌, దేవానందరెడ్డి, జగరాజుపల్లి మురళీరెడ్డి, పెద్దఎత్తున కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-13T05:41:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising