ఈ ప్రభుత్వానికి ప్రజల కష్టాలు పట్టవా? : టీడీపీ
ABN, First Publish Date - 2022-12-07T23:50:16+05:30
ఈ ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్ట వా అని టీడీపీ 25వ వార్డు ఇనచార్జ్ భీమనేనిప్రసాద్‌నాయుడు పేర్కొ న్నారు.
ధర్మవరం, డిసెంబరు 7 : ఈ ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్ట వా అని టీడీపీ 25వ వార్డు ఇనచార్జ్ భీమనేనిప్రసాద్‌నాయుడు పేర్కొ న్నారు. ఆయన ఆధ్వర్యంలో బుధవారం టీడీపీ నాయకులు పట్టణంలోని 25వ వార్డులో విస్తృతంగా ప్రర్యటించారు. వైసీపీ ప్రభుత్వప్రజావ్యతిరేక కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేస్తూ... ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వార్డులో ప్రజలు పలు సమస్యలు తెలిపార ని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చీమలరామాంజి, అంకన్న, క్లస్టర్ రామాంజి, బాబు, కేశవ, గాలిప్రకాశ, లోమడరాజు, కాయలరామంజి, గడ్డంసూరి, చిరంజీవి పాల్గొన్నారు.
తాడిమర్రి: మండలంలోని శివంపల్లిలో బుధవారం ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు నిర్వహించారు. ప్రతిఇంటికి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరాతీశారు. పేర్లు నమోదు చేసుకుని ప్రతిఇంటి వద్ద మిస్‌డ్ కాల్ ఇప్పించే కార్యక్రమం చేపట్టారు. వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులుప డుతున్నారని, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచి నడ్డివిరుస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కూచి రామ్మోహన, నాయకులు రామా నాయుడు, భాస్కర్‌గౌడ్, నిడిగల్లు సర్పంచ గోనుగుంట్ల భూషణ్, రవీంద్రారెడ్డి, భూపాల్‌రెడ్డి, వెంకటరాముడు, సాంబ, రవి పాల్గొన్నారు.
బత్తలపల్లి: వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాన్ని వివరిం చేందుకే ఇదేంఖర్మ మనరాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు టీడీపీ నాయకులు తెలిపారు. మండలకేంద్రమైన బత్తలపల్లిలో బుధవారం టీడీపీ నాయకులు ఇంటింటీకి వెళ్లి వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాన్ని వివరించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పేదల అభివృద్ది మరగునపడుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని గుర్తించి ప్రజలకు మేలు చేసేవారికే ఓట్లు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండలకన్వీనర్ నారాయణరెడ్డి, డేరంగులప్రతాప్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T23:50:17+05:30 IST