ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా ఇళ్లను తొలగించకండి

ABN, First Publish Date - 2022-07-08T04:57:55+05:30

కొన్నేళ్లుగా నివాసముంటున్న తమ ఇళ్లను తొలగించవద్దంటూ నగరపంచాయతీ పరిధిలోని చిత్రావతి నదీ పరివాహక ప్రాంతం 3వ వార్డు వాసులు ఆర్డీఓ భాగ్యరేఖకు వినతిపత్రం అందజేశారు.

ఆర్డీఓకు భాగ్యరేఖకు వినతిపత్రం ఇస్తున్న నదీ పరివాహక ప్రాతం 3వ వార్డు వాసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఆర్డీఓకు విన్నవించిన 3వ వార్డు వాసులు 

పుట్టపర్తిరూరల్‌, జూలై 7: కొన్నేళ్లుగా నివాసముంటున్న తమ ఇళ్లను తొలగించవద్దంటూ నగరపంచాయతీ పరిధిలోని చిత్రావతి నదీ పరివాహక ప్రాంతం 3వ వార్డు వాసులు  ఆర్డీఓ భాగ్యరేఖకు వినతిపత్రం అందజేశారు. తహసీల్దార్‌ సంజాయషీ నోటీసులు అందజేయడంతో వారు గురువారం ఆర్డీఓను కలిశారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ... తమకు 1982లో ప్రభుత్వం అక్కడ పట్టాలు అందచేసిందని, అందులో తాము పుడా, గ్రామ పంచాయతీ అనుమతులతో పక్కాగృహాలునిర్మించుకొని జీవనం సాగిస్తున్నామన్నారు. ఇందులో ప్రజాప్రతినిధులు సైతం పలు అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి తమను ఖాళీచేయమని తహసీల్దార్‌ నోటీసులిస్తే ఎక్కడికి వెళ్లాలని ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ...  ఇప్పటికప్పుడు ఖాళీచేయమనలేదని, రెవెన్యూ వారు ఇచ్చిన నోటీసులకు మీరు సంజాయిషీ ఇవ్వాలన్నారు. దానిని ఉన్నతాదికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే విదంగా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పులను ఇప్పుడు సరిదిద్దకపోతే భవిష్యత్తులో ఉపద్రవాలు జరిగి  భారీగా ప్రాణనష్టం జరిగితే మేము బాధ్యులమవు తామని ఆర్డీఓ తెలి పారు. ఇందులో నిజంగా పేదవారుంటే 90రోజులలో వారికి పునరావాసం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మదనమోహనడ్డి, మల్లి, రమేష్‌, సూర్య నారాయణ, సుబ్రహ్మణ్యం ఆదినారాయణ, రాజేంద్ర, రంగప్ప, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-08T04:57:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising