ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి పనుల్లో అవకతవకలు వద్దు

ABN, First Publish Date - 2022-06-29T05:36:00+05:30

జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హా మీ పనుల్లో ఎలాంటి అవకతవకలు జరగకూడదని, పనుల్లో కూడా నాణ్యత ఉండాల్సిందేనని రాష్ట్ర సామాజిక తనిఖీ అధికారి కోనయ్య తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌టీఎం కోనయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రాష్ట్ర సామాజిక తనిఖీ అధికారి కోనయ్య

అనంతపురం క్లాక్‌టవర్‌, జూన 28: జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హా మీ పనుల్లో  ఎలాంటి అవకతవకలు జరగకూడదని, పనుల్లో కూడా నాణ్యత ఉండాల్సిందేనని రాష్ట్ర సామాజిక తనిఖీ అధికారి కోనయ్య తెలిపారు. మంగళవారం స్థానిక డ్వామా సమావేశమందిరంలో రాష్ట్ర సామాజిక తనిఖీ అధికారి కోనయ్య ఆధ్వర్యంలో ఉపాధి పనుల నాణ్యతపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్‌టీఎం కోనయ్య మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి పనులను పరిశీలించామని, అయితే అక్కడక్కడ పనుల నాణ్యత లోపించిందని తెలిపారు. జిల్లాలో చేపడుతున్న ప్రతి ఉపాధి పని జియో ట్యాగ్‌ చేయాలన్నారు. రికార్డుల్లో ఉండే వివరాలకు, క్షేత్రస్థాయిలో జరిగిన పనుల మధ్య వ్యత్యాసాలు లేకుండా చూడాలన్నారు. సామాజిక తనిఖీల్లో తేల్చిన సొమ్ములను వెంటనే బాధ్యుల నుంచి రికవరీ చేయాలని సూచించారు. ఉపాధి పనులలో నాణ్యత లోపిస్తే బిల్లులు నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి, పంచాయతీ రాజ్‌ శాఖ ఎస్‌ఈ బాగ్యరాజ్‌, డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి, ఏపీడీలు విజయ్‌కుమార్‌, అయేషా, నీలిమ, విజయలక్ష్మి, ఆదినారాయణమ్మ, శంకర్‌, డీఆర్‌పీలు, ఏపీఓలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-29T05:36:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising