ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లర్లకే అభివృద్ధి పరిమితం

ABN, First Publish Date - 2022-12-16T23:58:30+05:30

జిల్లా వైద్యకళాశాలలో అభివృద్ధి అటకెక్కింది. బోధనాసుపత్రిలో వసతులు కల్పించాలని నిధులు కేటాయించి నా పనులు మాత్రం ఎకడివక్కడ నిలిచిపోయాయి.

ఆస్పత్రి ఆవరణలో జీ-ప్లస్‌2 బ్లాక్‌ నిర్మాణం పునాదులకే పరిమితమైన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిట్టదంటూ మొండికేసిన కాంట్రాక్టర్‌

రూ.60కోట్ల పనులపై అయోమయం

వైద్యకళాశాలలో ముందుకు సాగని పనులు

అనంతపురం టౌన, డిసెంబరు 16: జిల్లా వైద్యకళాశాలలో అభివృద్ధి అటకెక్కింది. బోధనాసుపత్రిలో వసతులు కల్పించాలని నిధులు కేటాయించి నా పనులు మాత్రం ఎకడివక్కడ నిలిచిపోయాయి. టీడీపీ పాలనలో ఈ వైద్యకళాశాలలో వసతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.60కోట్లు నిధులు కేటాయించారు. అప్పట్లో పనులకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ పనులపై తీవ్ర నిర్లక్ష్యం వహిస్తూ వస్తోంది. దీంతో నాలుగేళ్లుగా అభివృద్ధి పనులు పునాదులకే పరిమితమయ్యాయి.

వసతుల కోసం రూ.60కోట్లు

జిల్లా వైద్యకళాశాలలో వసతుల కోసం టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది. అప్పట్లో ఈ బోధనాసుపత్రిలో ప్రత్యేక వసతుల బ్లాక్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. జిల్లా ఆస్పత్రి ఆవరణలోని కళాశాల సమీపంలో ప్రత్యేకంగా లైబ్రరీ, ల్యాబ్‌, లెక్చరర్స్‌ గ్యాలరీలు ఏర్పాటుకు అడుగులు వేశారు. అలాగే వైద్యకళాశాలలో విద్యార్థుల కోసం హాస్టల్‌ భవనాల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్‌ కాంట్రాక్ట్‌ దక్కించుకొని పనులు మొదలుపెట్టారు. జీ-ప్లస్‌2 ఒక బ్లాక్‌, జీ-ప్లస్‌3 ఒక బ్లాక్‌ నిర్మాణానికి పిల్లర్లు వేశారు. హాస్టల్‌ భవన నిర్మాణానికి పనులు చేపట్టారు. అయితే జీ-ప్లస్‌2, జీ-ప్లస్‌3 బ్లాక్‌ల నిర్మాణాల పనులు పిల్లర్లకే పరిమితమైపోయాయి. హాస్టల్‌ భవనం స్లాబ్‌ వరకు వచ్చి ఆగిపోయింది. నాలుగేళ్లు అవుతున్నా ఈ నిర్మాణాలు గురించి పట్టించుకొనే నాథుడే లేడు.

వైసీపీ నిర్లక్ష్యమే కారణం... కోర్టుకు కాంట్రాక్టర్‌

నిర్మాణాల్లో జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ హయాంలో కాంట్రాక్ట్‌లు దక్కించుకొని చేపడుతున్న పనులను ఆపేశారు. ఆ తర్వాత కాంట్రాక్టర్‌ కూడా మౌనంగా ఉండిపోయారు. చివరకు వైద్యశాఖకు సంబంధించిన ఎమర్జెన్సీ పనుల పేరుతో మళ్లీ నిర్మాణాలు సాగించాలని సూచించారు. ఆ సమయంలో కరోనా వెంటాడుతూ వచ్చింది. దీంతో పనులు పూర్తిగా ఆగిపోయాయి. ఇప్పుడు మెటీరియల్‌ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో కాంట్రాక్టర్‌ పాత ధరలకు నిర్మాణాలు చేయలేనని చేతులెత్తేశాడు. ప్రభుత్వం టెండర్‌ ప్రకారం పనులు చేయాల్సిందేనని లేకపోతే చర్యలు తీసుకుంటామని నోటీసులు జారీ చేసింది. దీంతో ఆ కాంట్రాక్టర్‌ కోర్టును ఆశ్రయించడంతో ఈ పనులపై పూర్తిగా బండ పడింది. వైసీపీ ప్రభుత్వం యథాతథంగా పనులు జరిగేలా చూసి ఉంటే ఆ నిర్మాణాలు పూర్తి అయ్యేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కాంట్రాక్టర్‌ కోర్టుకెళ్లడంతోనే ఆగాయి: రాజగోపాల్‌ రెడ్డి, ఈఈ

ఆస్పత్రి ఆవరణలో చేపట్టిన అభివృద్ధి పనులు వెంటనే చేయాలని కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇచ్చాం. అయితే పాత టెండర్‌ ధరలు గిట్టవని చెప్పారు. చేయకపోతే చర్యలు తీసుకుంటామని నోటీసు ఇవ్వడంతో ఆయన కోర్టుకు వెళ్లారు. అందుకే పనులు ఆగిపోయాయి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.

మరో రూ.78 కోట్లు కేటాయించారు: డాక్టర్‌ నీరజ, కళాశాల ప్రిన్సిపాల్‌

కేంద్ర ప్రభుత్వం వైద్యకళాశాలకు కొత్తగా మరో 65 పీజీ సీట్లు మంజూరు చేసింది. అందుకు అవసరమైన వసతులు నిర్మాణానికి రూ.78కోట్లు కేటాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిధులు ఇవ్వాల్సి ఉంది. అందుకు అవసరమైన ఏఏ పనులు చేపట్టాలో ప్రతిపాదనలు తయారు చేసి పంపాల్సి ఉంది. ఈ పనులు చేపట్టడానికి మరింత ఆలస్యం అవుతుంది.

Updated Date - 2022-12-16T23:58:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising