ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి : బీకే

ABN, First Publish Date - 2022-10-08T04:59:48+05:30

జగన ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని శ్రీసత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న బీకే పార్థసారథి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరాపురం, అక్టోబరు 7: జగన ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని శ్రీసత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. వైసీపీ హయాంలో అన్నివర్గాల ప్రజలకు తీరని అన్యాయం జరిగిందన్నారు.  ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేస్తే టీడీపీ నాయకులు, ప్రజా సంఘాలపై కేసులు నమోదు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. నందమూరి తారకరామారావు పేరుతో ఉన్న హెల్త్‌ యూనివర్సిటీకి పేరుమార్చడం హేయమైన చర్య అన్నారు. రాష్ట్రంలో పశ్చిమరాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీచేస్తున్న భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి తరుపున పట్టభద్రులను ఓటర్లుగా నమోదుచేయించేందుకు ప్రతి కార్యకర్త కృషిచేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి, జిల్లా టీడీపీ కార్యదర్శి నరసింహమూర్తి, మండల కన్వీనర్‌ శివరుద్రప్ప, అగళి జడ్పీటీసీ ఉమేష్‌, జిల్లా మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు భక్తర్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన సుబ్బరాయుడు, రాజు, తెలుగు యువత ఉపాధ్యక్షుడు నరేష్‌, మండల కన్వీనర్‌ దాసిరెడ్డి, మద్దనకుంటప్ప, మాజీ సర్పంచులు శకునప్ప, చంద్రశేఖర్‌ గౌడ్‌, హనుమంతరాయ, సర్పంచులు ధనుంజయ, లోకేష్‌, నాయకులు మైనార్టీసెల్‌ అధికార ప్రతినిధి దాదు, మండల టీడీపీ అధికార ప్రతినిధి ప్రసాద్‌, నాయకులు మనోహర్‌, మాధవరాజు, ఓబులేసు, గురుసిద్దప్ప, రామచంద్రప్ప, నాగరాజు, రఘు, సిద్దేశ్వర, ప్రకాష్‌, నవీనకుమార్‌, ఈరణ్ణ, గురుసిద్దప్ప, తదితరులు పాల్గొన్నారు. 




Updated Date - 2022-10-08T04:59:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising