ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దైవాలమడుగులో దాహం కేకలు

ABN, First Publish Date - 2022-05-22T06:51:30+05:30

మండలంలోని దైవాలమడుగు గ్రామంలో గుక్కెడు తాగునీటి కోసం కూడా గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాడికి, మే 21: మండలంలోని దైవాలమడుగు గ్రామంలో గుక్కెడు తాగునీటి కోసం కూడా గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గ్రామంలో ఉన్నది ఒకే మంచినీటి బోరు. పైగా కరెంట్‌ కోతలు. బోరు మోటా రుకు కరెంట్‌ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియదు. బోరుబావి మరమ్మతుకు రావడం గమనార్హం. తాగునీటి కోసం బిందెలను వంతుల వారీగా క్యూలో పెట్టుకోవాల్సి వస్తోంది. గ్రామంలోకి ఎప్పుడు వచ్చిన బోరుబా వి వద్ద వందల సంఖ్యలో బిందెలు క్యూలో కనిపిస్తాయని గ్రామస్థులు తెలిపా రు. నీటికోసం ప్రతి ఇంటి నుంచి ఒకరిద్దరు కాపు కాయాల్సి వస్తోంది. తాగు నీటి సమస్యను అధికారులకు విన్నవించినా పట్టించుకొనే అధికారులు, ప్రజా ప్రతినిధులు లేకపోవడం దురదృష్టం అని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామం జిల్లా సరిహద్దు గ్రామం కావడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎప్పుడో ఎన్నికల సమయంలో వస్తారు, కల్లబొల్లి మాటలు చెబుతారు వెళ్తారు అంతే అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్థులు. దీనిపై పంచాయతీ కార్యదర్శి (ఎఫ్‌ఏసీ) ల క్ష్మేంద్రకుమార్‌ను వివరణ కోరగా ఒకట్రెండురోజుల్లో సమస్యను పరిష్క రిస్తామని తెలిపారు.

Updated Date - 2022-05-22T06:51:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising