రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలం
ABN, First Publish Date - 2022-01-13T06:02:28+05:30
రైతు సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు రాంభూపాల్ విమర్శించారు.
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు రాంభూపాల్
తాడిపత్రి, జనవరి12: రైతు సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు రాంభూపాల్ విమర్శించారు. రైతు కూలీల రక్షణ పేరుతో తలపెట్టిన అమరావతి స్కూటర్ యాత్రను విజయవంతం చేయాలనీ, రైతు కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ పట్టణంలో బుధవారం సంతకాల సేకరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 21 నుంచి 26వ తేదీ వరకు అమరావతికి వందలాది మందితో స్కూటర్‌యాత్ర చేపడుతున్నామన్నారు. అమరావతిలో పెద్దఎత్తున ధర్నా చేపడతామన్నారు. గత నవంబరు 22 నుంచి డిసెంబరు 18 వరకు జిల్లాలో అనావృష్టి, అతివృష్టి వల్ల నష్టపోయిన రైతులు, కూలీలను ఆదుకోవాలని కోరుతూ జిల్లావ్యాప్తంగా 820 కిలోమీటర్లు నడిచి 187 గ్రామాల్లో పాదయాత్ర చేశామన్నారు. అప్పట్లో ప్రభుత్వం స్పందించి పంట నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చినా.. నేటివరకు నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వ ని ర్లక్ష్య వైఖరి కారణంగా రైతుల ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉం దనీ, ఇతర రాష్ట్రాలకు కూలీలు వలస వెళుతున్నారని ఆవేదన చెందారు. సంతకాల సేకరణ కార్యక్రమంలో అంగనవాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన తాడిపత్రి ప్రాజెక్ట్ అధ్యక్షురాలు నాగేశ్వరమ్మ, సీపీఎం పట్టణ కార్యదర్శి నరసింహారెడ్డి, సీఐటీయూ పట్టణ కార్యద ర్శి ఉమాగౌడ్, కేవీపీఎస్ పట్టణ కార్యదర్శి రాంమోహన, సీఐటీయూ నేతలు గోవిందమ్మ, రమాదేవి పాల్గొన్నారు.
Updated Date - 2022-01-13T06:02:28+05:30 IST