ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనసాగిన ఉపాధ్యాయుల నిరసన

ABN, First Publish Date - 2022-08-19T04:46:25+05:30

ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చి న యాప్‌లను నిరసిస్తూ ఉపాధ్యాయులు చేపట్టిన నిరసన జిల్లా వ్యాప్తంగా గురువారం కూడా కొనసాగింది.

రొద్దం ఎంఈఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయుల నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోరంట్ల/రొద్దం, ఆగస్టు 18: ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చి న యాప్‌లను నిరసిస్తూ ఉపాధ్యాయులు చేపట్టిన నిరసన జిల్లా వ్యాప్తంగా గురువారం కూడా కొనసాగింది. గోరంట్ల ఎమ్మార్సీ కా ర్యాలయం, రొద్దం ఎంఈఓ కార్యాలయాల వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉ పాధ్యాయుల మొబైల్‌లో ముఖ హాజరు ఫేషియల్‌ యాప్‌ను డౌనలోడ్‌ చేసుకోమని చెప్పడం వ్యక్తిగత సమాచారానికి ముప్పు కలుతుగుతుందన్నారు. ముఖహాజరుకు వ్యతిరేకం కాదని, అయితే ప్ర భుత్వమే ప్రత్యేకంగా ట్యాబ్‌లు సరఫరా చేయాలన్నారు. ఉపాధ్యాయులపై కక్షసాధింపు చర్యగా భావించాల్సి వస్తుందన్నారు. అనం తరం ఎంఈఓలు గోపాల్‌నాయక్‌, ఆంజనేయులునాయక్‌కు వినతిపత్రం అందించారు. గోరంట్ల నిరసనలో నాయకులు సుధాకర్‌రెడ్డి, సూర్యనారాయణరెడ్డి, మురళి, కిష్టప్ప, రామచంద్ర, సుధాక ర్‌, మ ధుసూదన, వెంకటేశ, క్రిష్ణమూర్తి, రామక్రిష్ణ, శ్రీధర్‌, రామాంజినేయులు, నాగేష్‌, దామోదర్‌రెడ్డి, నాగరాజు, విద్యాసాగర్‌, అశోక్‌, రొద్దంలో యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, ఏపీటీఎఫ్‌ నాయకులు చంద్రశేఖర్‌ గౌడ్‌, మూర్తి, గోపి, రంగప్ప, బాలాజీ, శే షాద్రి, శ్రీనివాసులు, మహ్మద్‌పీరా, మల్లికార్జున పాల్గొన్నారు. 


మొరాయించిన యాప్‌

మూడోరోజూ తప్పని తిప్పలు 

రొద్దం మండలవ్యాప్తంగా ఉపాధ్యాయులు యాప్‌ ద్వారా ఉద యం 9 గంటలలోపే హాజరు నమోదు చేసుకోవాలనే నిబంధనతో తిప్పలు పడ్డారు. గురువారం మూడో రోజు యాప్‌ మొరాయించింది. ప్రతి పాఠశాలలోనూ ఉపాధ్యాయులు యాప్‌ డౌనలోడ్‌ చేసి హాజ రు నమోదు చేయడానికి ప్రయత్నించారు. అయితే 8.30 గంటల్లో మాత్రమే యాప్‌ పనిచేసిందని కొంతమంది ఉపాధ్యాయులు వాపోయారు. అంతముందుగా పనిచేస్తే పాఠశాలకు చేరుకునేదెప్పుడని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక సంఖ్యలో హాజరు నమోదు ప్రక్రియ పనిచేయకపోవడంతో పాఠశాల ప్రాంగణాల్లోనే సెల్‌ఫోనలు పట్టుకుని కలియతిరిగారు. విద్యార్థులకు పాఠాలు బోధించాలో, హాజరు నమోదు చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. 11.30 వరకు యాప్‌ద్వారా హాజరు నమోదుకు ప్రయత్నించినా ఫలితందక్కలేదు. 


Updated Date - 2022-08-19T04:46:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising