ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ టెస్ట్‌ల కోసం విద్యార్థుల అవస్థలు

ABN, First Publish Date - 2022-01-18T05:33:44+05:30

కొవిడ్‌ పరీక్షలు చేయించుకునేందుకు విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. సంక్రాంతి సెలవులు ముగియడంతో స్వగ్రామాల నుంచి విద్యార్థులు వసతి గృహాలకు వెళ్తున్నారు.

పేర్లు నమోదు చేసుకుంటున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిందూపురం టౌన, జనవరి 17: కొవిడ్‌ పరీక్షలు చేయించుకునేందుకు విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. సంక్రాంతి సెలవులు ముగియడంతో స్వగ్రామాల నుంచి విద్యార్థులు వసతి గృహాలకు వెళ్తున్నారు. అయితే అక్కడి విద్యాసంస్థలు కొవిడ్‌ పరీక్షలు చేయించుకుని వస్తేనే వసతి గృహాల్లో అనుమతిస్తామని తెగేసి చెప్పడంతో విద్యార్థులు పరీక్షల కోసం ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నారు. అయితే ప్రతిరోజూ వంద నుంచి 200 మంది విద్యార్థులు కొవిడ్‌ టెస్ట్‌ కోసం వస్తున్నారు. వారిలో నలుగురు, ఐదుగురు మినహా మిగిలిన వారికి నెగిటివ్‌ వస్తోంది. దీంతో టెస్టింగ్‌ కిట్‌లు వృధా అవుతాయని ఉన్నతాధికారుల ఆదేశాలున్నాయని వైద్యాధికారులు అంటున్నారు. ప్రైవేట్‌లో చేయించుకుందామంటే అక్కడ పరీక్షలు చేయరని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సహకరించడం లేదని వాపోతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం లక్షణాలుంటేనే టెస్ట్‌ చేయాలని ఆదేశాలు ఉన్నాయంటూ వైద్యులు పేర్కొంటున్నారు. కానీ వసతి గృహాల్లో ఎందుకు టెస్టింగ్‌ సర్టిఫికెట్‌ అడుగుతున్నారో అర్థం కాలేదని వైద్యులు అంటున్నారు. 


Updated Date - 2022-01-18T05:33:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising