ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

ABN, First Publish Date - 2022-05-18T06:33:19+05:30

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలంటూ కలెక్టర్‌ బసంతకుమార్‌.. అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ బసంతకుమార్‌

పుట్టపరి,్త మే 17: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలంటూ కలెక్టర్‌ బసంతకుమార్‌.. అధికారులను ఆదేశించారు. మంగళవా రం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌లో మొదటిసారి జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలపై ప్రజలతోపాటు పాఠశాల, కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఏటా జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో 250 మంది మరణిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయన్నారు. వాటి నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు నిబంధనలు పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రమాదసమయంలో సాయం అందించిన వ్యక్తులకు రూ.ఐదువేలు నగదు బహుమతి, ప్రశంసాపత్రం ప్రదానం చేస్తామన్నారు. అనధికారికంగా స్పీడ్‌ బ్రేకర్లు వేయడం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందనీ, దీన్ని నివారించాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా రవాణా అధికారి నిరంజనరెడ్డి, పీఆర్‌ ఎస్‌ఈ గోపాల్‌రెడ్డి, ఎస్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎం మధుసూదన, జిల్లా వైద్యాధికారి పద్మావతి, ఏఓ సోమ్లానాయక్‌, మోటారు వెహికల్‌ ఇనస్పెక్టర్లు రాణి, మల్లికార్జున, శ్రీనివాసులురెడ్డి, ఏఓ శ్రీనివాసులు, మున్సిపల్‌, 108, రవాణా శాఖాధికారులు పాల్గొన్నారు


Updated Date - 2022-05-18T06:33:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising