ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులకు సీఎం జగన్ మోసం

ABN, First Publish Date - 2022-01-22T05:17:55+05:30

ఉద్యోగులకు న్యాయం చేయకుండా వారిని సీఎం జగన్ మోహన రెడ్డి ముంచేశాడని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పేర్కొన్నా రు.

విలేకరులతో మాట్లాడుతున్న గుండుమల తిప్పేస్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మడకశిరటౌన్, జనవరి 21: ఉద్యోగులకు న్యాయం చేయకుండా వారిని సీఎం జగన్ మోహన రెడ్డి ముంచేశాడని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పేర్కొన్నా రు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పోరాట స్ఫూర్తి అభినందనీయమన్నారు. శుక్రవారం బాలాజీ నగర్‌లోని ఎమ్మెల్సీ స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులను కలుపుకొని వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉన్నా ఏమాత్రం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఉద్యోగులు చేస్తున్న ఆందోళన రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టించిందన్నారు. కొన్నిచోట్ల వారిపై లాఠీ ఛార్జీలు చేయడం, అరెస్టులు చేయడం జగన ప్రభుత్వ క్రూరత్వానికి పరాకాష్ట అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ ఫిట్‌మెంట్‌, ఐఆర్‌, హెచఆర్‌ఏలు దక్కించుకోవడం వారి హక్కు అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో సైతం రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్‌ ఉన్నా తెలంగాణ కన్నా ఒక శాతం ఎ క్కువగా 43 శాతం పీఆర్‌సీ ఇచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఉద్యోగులకు మాయమాటలు చెబుతూ రాష్ట్రంలో విడిపోయి 8 సంవత్సరాలు అవుతున్నా ఇప్పుడు విడిపోయినట్లు ఇచ్చిన మాట తప్పడం ఎంతవరకు న్యాయం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించి సాధ్యాసాధ్యాలను బట్టి తగు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరేష్‌, యువత అధ్యక్షులు తిమ్మరాజు, పుల్లయ్యచౌదరి, సోమనాథరెడ్డి, హనుమంతరెడ్డి, ఉమాశంకర్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-22T05:17:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising