ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్నాథుడి రథయాత్ర

ABN, First Publish Date - 2022-07-02T06:41:00+05:30

అనంతపురం జిల్లా కేంద్రంలో ఇస్కాన ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన జగన్నాథ రథయాత్రకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడేళ్ల తరువాత వేడుక

పులకించిన అనంత

 అనంతపురం జిల్లా కేంద్రంలో ఇస్కాన ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన జగన్నాథ రథయాత్రకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. తిరుపతి ఇస్కాన అధ్యక్షుడు రేవతి రువన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జగన్నాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బంగారు వర్ణపు చీపురుతో రథం ముందు ఊడ్చి, రథయాత్రను ప్రారంభించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి జగన్నాథుడి రథాన్ని లాగి తన్మయత్వం పొందారు. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి వచ్చిన కళాకారులు రథయాత్రలో ప్రదర్శనలు ఇచ్చారు. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో 2019 నుంచి అనంతలో జగన్నాథ రథయాత్ర నిర్వహించలేదు. మూడేళ్ల తర్వాత రథయాత్ర నిర్వహించడంతో భక్తుల తాకిడి పెరిగింది. రథయాత్ర సాగే సమయంలో నగరంలో వర్షం కురిసింది. అయినా భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నగరంలో  స్థిరపడిన ఇతర రాషా్ట్రలవారు ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రథం ముందు మహిళలు నృత్యం చేస్తూ సందడి చేశారు.

- అనంతపురం కల్చరల్‌



Updated Date - 2022-07-02T06:41:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising