ఘనంగా పరిటాల శ్రీరామ్ జన్మదిన వేడుకలు
ABN, First Publish Date - 2022-09-23T05:21:13+05:30
టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్, రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ జన్మదిన వేడుకలను టీడీపీ నాయ కులు పట్టణంలో వాడవాడలా పండుగలా ఘనంగా జరుపుకున్నారు.
ధర్మవరం, సెప్టెంబరు 22: టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్, రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ జన్మదిన వేడుకలను టీడీపీ నాయ కులు పట్టణంలో వాడవాడలా పండుగలా ఘనంగా జరుపుకున్నారు. ముం దుగా పాండురంగస్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్ర హానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడే కేక్‌కట్ చేసి అల్పాహారం అందజేశారు. అనంతరం ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంిపిణీ చేశారు. గొట్లూరు అనాధాశ్రమంలో వృద్ధులకు అన్నదానంతో పాటు దుస్తుల ను పంపిణీచేశారు. అలాగే టీడీపీ 10వ వార్డు ఇనచార్జ్ క్రిష్ణాపురం జమీర్ అహమ్మద్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసినివాళులర్పించి, కేక్‌కట్ చేశారు. 25వ వార్డు ఇనచార్జ్ భీమనేని ప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో యర్రగుంట్లసర్కిల్‌లో అన్నదాన కార్యక్రమా న్ని పెద్దఎత్తున చేపట్టారు. విజయవాడకు చెందిన పరిటాల శ్రీరామ్ అభిమాని మోహనక్రిష్ణ, 5వ వార్డు ఇనచార్జ్ దేవరకొండ రామకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు పరిటాల శ్రీరామ్‌కు ఎద్దుబండి, నాగలి బొమ్మను బహూకరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజేంద్రనగర్‌లోని టీడీపీ పట్టణ క్లస్టర్ ప్రతినిధులు నాగూర్ హుస్సేన, రాళ్లపల్లి షరీఫ్, 34వ వార్డు ఇనచార్జ్ బీబీ ఆధ్వర్యంలో అనాధాశ్రమంలో వృద్ధులకు దుస్తులు పంపిణీ చేసి, అన్నదానం చేశారు. అనంతపురం తరలివెళ్లి పరిటాలశ్రీరామ్‌కు పుష్పగుచ్ఛాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీనాయకులు కమ తం కాటమయ్య, పురుషోత్తంగౌడ్, చింతపులుసు పెద్దన్న, పరిశేసుధాకర్, నాగూర్ హుస్సేన, అంబటి సనత, రాళ్లపల్లి షరీఫ్, రాంపురంశీన, పఠాన బాబూఖాన, గరుగు వెంగప్ప, గోసల శ్రీరాములు, గంగారపు రవి, అమరా కేశవనాయుడు, చిన్నూరు భాస్కర్‌చౌదరి, బొట్టుకిష్ట, వరదరాజులు, చీమల నాగరాజు, అత్తర్ రహీం, ఓంకార్, చీమల రామాంజి, అనిల్‌కుమార్, రాజ్‌కుమార్‌నాయుడు, కరెంటు ఆది, టైలర్ కుళ్లాయప్ప, అడ్ర మహేశ, బత్తల గంగాధర్, మిడతల యుగంధర్, మల్కాపురం అశోక్, జయరాములు గౌడ్, కండే గంగాధర్, చెలిమి శివరాం, షాషావలి, షెహన్సా, అస్లాం, ఇర్షాద్, హోటల్ మారుతీస్వామి, కేతినేనిని రాజ, పూలకుంట్ల మహేశ పాల్గొన్నారు.
ధర్మవరంరూరల్: పరిటాలశ్రీరామ్ జన్మదిన వేడుకలను గురువారం గ్రామగ్రామానా పండుగలా నిర్వహించారు. పరిటాల శ్రీరామ్ ఆయురా రోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని ఆలయాల్లో పూజలు చేసి, కేక్‌లు కట్ చేశా రు. పలు గ్రామాల్లో అన్నదానం చేపట్టారు. అలాగే టీడీపీ మండల కమిటీ, బీసీసెల్, తెలుగుయువత నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున వెంకటాపు రం, అనంతపురం వెళ్లి పరిటాలశ్రీరామ్‌ను గజమాలలు, శాలువాలతో సత్క రించారు. కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మండల కన్వీనర్ పోతుకుంట లక్ష్మన్న, మాజీ కన్వీనర్ గొట్లూరు శ్రీనివాసులు, మాజీ జడ్పీటీసీ మేకల రామాంజనేయులు, తలారి వెంకటలక్ష్మి, విజయ్‌సారథి, చిగి చెర్ల రాఘవరెడ్డి, సర్పంచ ముత్యాలప్పనాయుడు, ఏలుకుంట్ల ఏగినాటి రమణ, గుత్తా సూరి, మోపూరి రామ్మోహన, గొట్లూరు శివయ్య, అనిల్‌గౌడ్, రేగాటిపల్లి నాగేంద్రరెడ్డి, తలారి ఈశ్వరయ్య, చిగిచెర్ల ఆదినారాయణ, పాళ్యం వెంకటేష్, పోతుకుంట రమేష్, చిట్రా రామ్మోహన, గరుడంపల్లి పోతలయ్య, కుణుతూరు శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్‌రెడ్డి, బడన్నపల్లి క్రిష్ట, గరుడంపల్లి చండ్రాయుడు, నంబూరి శివయ్య, నిమ్మలకుంట దళవాయి కుళ్లాయప్ప, సీతారంపల్లి తాతిరెడ్డి, కొమ్మినేని సూర్యనారాయణ, సాకే వీర, పోతుల నాగేపల్లి ఆదెప్ప, కత్తే కాటమయ్య తదితరులు పాల్గొన్నారు. టీడీపీ బీసీసెల్ ఆధ్వర్యంలో వెంకటాపురంలో పరిటాలశ్రీరామ్‌కు గజ మాల వేసి, కేక్‌కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు ముచ్చు రామిక్రిష్ణ, జంగం నరసింహులు, బోయ గులగాని చిరంజీవి, గరుడంపల్లి చంద్రశేఖర్, పోతలయ్య, వెంకటేష్, బడన్నపల్లి రామాంజినేయులు, రజక శ్రీరాములు, పోతులనాగేపల్లిశ్రీనివాసులు, గరుడంపల్లి అంజి, బిల్వంపల్లి రవియాదవ్, మల్లేనిపల్లి చంద్ర, బిల్వంపల్లి బాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగు యువత ఆధ్వర్యంలో అనంతపురంలో పరిటాలశ్రీరామ్‌కు పుష్పగుచ్ఛం అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు గడుపూటి విజయ్‌చౌదరి, నాగలూరు లింగప్ప, తొగటఅనిల్, అమర సుధాకర్‌నాయుడు, సంగాల బాలు, గొట్లూరు బొంత చిరంజీవి, ప్రసాద్, పవనరెడ్డి, అశోక్ వాల్మీ కి పాల్గొన్నారు. మండలంలోని గొట్లూరు అనాథారఽశమంలో పరిటాలశ్రీరామ్ జన్మదిన వేడుకలను టీడీపీ ఆ గ్రామ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. వృద్దుల సమక్షంలో కేక్ కట్‌చేసి అన్నదానం చేశారు. టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు తాడిమర్రి శ్రీనివాసులు (గొట్లూరుశీన), మాజీ సర్పంచ శివయ్య, అనిల్‌గౌడ్, తలారిఈశ్వరయ్య, తలారి నారాయణస్వామి, బొంత చిరంజీవి, మల్లికార్జున, రఫీ, గునగాని చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ధర్మవరం లోని విభిన్నప్రతిభావంతుల(దివ్యాంగులు) నాగూర్‌స్టాలిన ఉమర్ ఆధ్వర్యం లో పరిటాలశ్రీరామ్ జన్మదిన సందర్భంగా కేక్‌కట్ చేశారు. షాజహాన, హను మంతు, దేవ తదితరులు పాల్గొన్నారు. అలాగే చిగిచెర్ల గ్రామంలో కేక్ కట్ చేశారు. పరిటాల శ్రీరామ్ అభిమానులు చిగిచెర్ల నారాయణప్ప, హేమంత, కాటమయ్య, రాము, అశోక్, నరేష్, బొగ్గులమధు తదితరులు పాల్గొన్నారు. బత్తలపల్లిలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి గొట్లూరు నుంచి టీడీపీ యువ నాయకుడు అనిల్‌గౌడ్ ఆధ్వర్యంలో 15మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లి రక్తదానం చేశారు. నా యకులు, కార్యకర్తలు రఫీ, తలమర్లప్ప, గునగానిచిరంజీవి, బొంతచిరంజీవి, వినోద్, చెన్నకేశవులు, ఓము, చిరంజీవి, ఆంజనేయులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
పుట్టపర్తి,సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ జన్మదిన వేడుకల్లో రాష్ట్ర టీడీపీ వడ్డెర సాధికార సమితి కన్వీనర్ వడ్డె వెంకట్ పాల్గొని గజమాలతో సన్మానించారు. పరిటాల శ్రీరామ్‌కు శుభాకాం క్షలు తెలిపారు. వడ్డెర సంఘం నాయకులు కొత్తచెరువు పెద్దన్న, వెంకటా పు రం రాజా, చిలమత్తూరు వెంకటేష్, పల్లపు మహేంద్ర తదితరులు ఉన్నారు.
బత్తలపల్లి: పరిటాలశ్రీరామ్ జన్మదిన వేడుకల సందర్బంగా బత్తలపల్లిలోని ఆర్‌కే పంక్షనహాల్‌లో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన లభించింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పరిటాలఅభిమానులు 165 మంది రక్తదానం చేశారు. వారికి టీడీపీ, టీఎనఎస్‌ఎఫ్, తెలుగుయువత నాయకులు అభినందనలు తెలిపారు. గంటాపురం జగ్గు వెంకటాపురానికి అనుచరులతో తరలివెళ్లి పరిటాలశ్రీరామ్‌ను గజమాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగురైతు నియోజకవర్గ అధ్యక్షుడు చల్లా శ్రీనివాసులు, టీఎనఎస్‌ఎఫ్ జిల్లా అధికారప్రతినిధి డేరంగుల ప్రతాప్, మండలకన్వీనర్ నారాయణరెడ్డి, కరణం హేమంతకుమార్, కేశవరెడ్డి, మ హేంద్ర, గంగయ్య, సురేంద్రనాయుడు, సాంబ, మందలశ్రీనివాసులు, రాజ శేఖర్ అనంతపురం తరలివెళ్లి పరిటాలశ్రీరామ్‌కు గజమాలలతో సత్కరిం చారు. రక్తదాన శిబిరం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ముదిగుబ్బ: పరిటాలశ్రీరామ్ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. ముందుగా స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బస్టాండ్ కూడలిలో టీడీపీ మండల కన్వీనర్ కరణం ప్రభాకర్ కేక్‌కట్ చేశారు. అనంతరం టీడీపీ పట్టణ అధ్యక్షుడు తుమ్మల మనోహర్ స్థానిక కేజీబీవీలో ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీచేశారు. టీడీపీ మండల, పట్టణ కన్వీనర్లు కరణం ప్రభాకర్, తుమ్మల మనోహర్, నాయకులు మహబూబ్‌పీరా, సోమల వినోద్‌బాబు, ఆనంద్, కృష్ణమూర్తి, గడ్డం మోహన, మల్లెల నారాయణస్వామి, సాంబశివారుడ్డి, చికెనతిరుపాలు, జానీ, నారాయణస్వామి, చంద్ర, రాధమ్మ, సూర్యశేఖర్‌రాజు, దొరిగిల్లు సూరి, రామచంద్ర, సాంబశివనాయక్, తెలుగయువత నాయకులు వినయ్, ప్రతాప్, మధు,. రాము, సనత,సాయి, గంగాద్రిలుపాల్గొన్నారు.
తాడిమర్రి: పరిటాలశ్రీరామ్ జన్మదిన వేడుకలు తాడిమర్రి మండలంలో ఘనంగా నిర్వహించారు. నారసింపల్లిలోని వృద్ధాశ్రమంలో వృద్దుల సమక్షం లో కేక్‌కట్ చేశారు. వారికి దుస్తులు పంపిణీ చేసి, అన్నదానం చేశారు. పరిటాలశ్రీరామ్ వచ్చే ఎన్నికలలో ఘన విజయం సాధించాలని పూజలు నిర్వహించారు. మండల కన్వీనర్ కూచిరామ్మోహన, బీసీసెల్‌నియోజకవర్గ అధ్యక్షుడు ఆత్మకూరు శ్రీనివాసులు, ఆలంసూరి, పర్వతయ్య, లక్ష్మీనారాయణ, సుధాకర్, చిల్లకొండయ్యపల్లి రమణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-09-23T05:21:13+05:30 IST