ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట రుణాల రెన్యువల్‌కు తిప్పలు

ABN, First Publish Date - 2022-05-17T06:15:18+05:30

రైతులు బ్యాంకుల్లో వ్యవసాయ రుణాల రెన్యువల్‌కు తిప్పలు ప డుతున్నారు. రొద్దం కెనరాబ్యాంక్‌, పెద్దమంతూరు ఆంధ్రప్రగతి గ్రామీణబ్యాంక్‌, తురకలాపట్నం యూనియన బ్యాంక్‌, కోగిర కెనరాబ్యాంక్‌ పరిధిలో రైతులు రుణాల రెన్యువ ల్‌కు ఉదయం నుంచే క్యూకడుతున్నారు.

కెనరా బ్యాంక్‌ వద్ద క్యూలో ఉన్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రొద్దం, మే 16:  రైతులు బ్యాంకుల్లో వ్యవసాయ రుణాల రెన్యువల్‌కు తిప్పలు ప డుతున్నారు. రొద్దం కెనరాబ్యాంక్‌, పెద్దమంతూరు ఆంధ్రప్రగతి గ్రామీణబ్యాంక్‌, తురకలాపట్నం యూనియన బ్యాంక్‌, కోగిర కెనరాబ్యాంక్‌ పరిధిలో రైతులు రుణాల రెన్యువ ల్‌కు ఉదయం నుంచే క్యూకడుతున్నారు. ఒక్కో బ్యాంకు పరిధిలో రోజుకు వంద టోక న్లు ఇచ్చి ఆయా బ్యాంకుల పరిధిలో రోజుకు వందమంది రుణాలు రెన్యువల్‌ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. అయితే వంద టోకన్లు కూడా పూర్తికాకపోవడంతో ఉ దయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్న రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటున్నారు. ఒక టోకనుకు ఒక రైతు నుంచే బ్యాంకులో నగదు జమచేయడానికి అవకాశం కల్పిస్తున్నారు. దీంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భార్య, భర్త పేరుమీద ఉన్న రుణాలపై వడీ కట్టడానికి వెళ్తే రొద్దం కెనరాబ్యాంక్‌ వారు ఒకరికి మాత్రమే నగదు కట్టించుకుంటున్నట్లు రైతులు వాపోతున్నారు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మీసేవా కేంద్రాల్లో వన-బీలు రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈసీలు నెలరోజులుగా మీ సేవా కేంద్రాల నుంచి రావడం లేదు.  దీంతో బ్యాంక్‌ అధికారులు కేవలం వన-బీ ఆధారంగానే రుణాలను రెన్యువల్‌ చేస్తున్నారు. 


Updated Date - 2022-05-17T06:15:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising