ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సందడిగా వినాయక నిమజ్జనం

ABN, First Publish Date - 2022-09-11T05:12:49+05:30

వినాయక చవితిని పురస్కరించుకొని పట్టణంలో 16 చోట్ల ఏర్పాటుచేసిన గణేష్‌ విగ్రహాలు శ నివారం కోలాహలం నడుమ నిమజ్జనానికి తరలాయి.

అమరాపురం ఊరేగింపులో భక్తుల సందడి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మడకశిరటౌన, సెప్టెంబరు 10: వినాయక చవితిని పురస్కరించుకొని పట్టణంలో 16 చోట్ల ఏర్పాటుచేసిన గణేష్‌ విగ్రహాలు శ నివారం కోలాహలం నడుమ నిమజ్జనానికి తరలాయి. వాల్మీకి స ర్కిల్‌, మారుతీనగర్‌, సాయిబాబా ఆలయం, మారమ్మ దేవాలయం, ఎమ్మార్సీ వద్ద కొలువైన గణపయ్యను ప్రధాన వీధుల్లో ఊరేగించా రు. యువకులు, చిన్నారులు రంగులు చల్లుకుంటూ, డప్పువాయిధ్యాల మధ్య నృత్యం చేస్తూ సందడి చేశారు. అనంతరం సమీప  చెరువులో నిమజ్జనం చేశారు. భక్తులకు అన్నదానం చేశారు.


అమరాపురం: మండలకేంద్రంలోని పాత పోలీస్‌స్టేషన ఆవరణ, పాత గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన గణేష్‌ విగ్రహాలను శనివారం అంగరంగ వైభవంగా ఊరేగించారు.  ప్రత్యేకంగా ముస్తాబైన వాహనాల్లో విగ్రహాలు అధిష్ఠింపజేసి, గురువయ్యల నృత్యప్రదర్శన, వివిధ బొమ్మల వేషధారణలతో గ్రామ వీధుల్లో ఊరేగించారు. యువకులు రంగులు చల్లుకుంటూ చోళమాంబవీధి, స్థానిక బస్టాండు గుండా ప్రదర్శనగా గణపయ్యలను నిమ జ్జనానికి తరలించారు. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.  


Updated Date - 2022-09-11T05:12:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising