ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భోగి మంటల్లో సీఎస్‌ నివేదిక ప్రతుల దహనం

ABN, First Publish Date - 2022-01-15T05:53:48+05:30

ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక సీఎస్‌ కమిటీ నివేదిక ప్రతులను యూటీఎఫ్‌ నాయకులు భోగి మంటల్లో ద హనం చేశారు.

ఉరవకొండలో సీఎస్‌ నివేదిక ప్రతులను భోగి మంటల్లో దహనం చేస్తున్నప్యాప్టో నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కళ్యాణదుర్గం, జనవరి 14: ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక సీఎస్‌ కమిటీ నివేదిక ప్రతులను యూటీఎఫ్‌ నాయకులు భోగి మంటల్లో ద హనం చేశారు. శుక్రవారం స్థానికంగా రాష్ట్ర నాయకులు జే నాగరాజు క్యాంపు కార్యాలయం ఎదుట భోగి మంటలు వేసి రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రతులను దహనం చేసి నిరసన తెలియజేశారు. ఈసందర్భంగా నా యకులు మాట్లాడుతూ 11 పీఆర్సీ కమిటీ అశుతో్‌షమిశ్రా నివేదిక బ యటపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన ఫి ట్మెంట్‌, సీపీఎస్‌ రద్దు, హెచఆర్‌ఏ అమలులో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఈశ్వరయ్య, అర్జున, తిమ్మప్ప, రాజన్న, రామాంజనేయులు, గోవిందు, గట్టు గోవిందు, కిష్ట ప్ప, సాయిరాం, చిత్తప్ప పాల్గొన్నారు. 


ప్యాప్టో ఆధ్వర్యంలో నిరసన

ఉరవకొండ: సీఎస్‌ కమిటీ నివేదికలో 23 శాతం ఫిట్‌మెంట్‌ను వ్య తిరేకిస్తూ ప్యాప్టో నాయకులు శుక్రవారం స్థానికంగా నిరసన చేపట్టారు. నివేదిక ప్రతులను భోగి మంటల్లో కాల్చి ప్రభుత్వ తీరును ఎండగట్టా రు. కార్యక్రమంలో నాయకులు భాస్కర్‌, నాగరాజు, ఓబన్న, రాజేష్‌, మ హేశ్వరప్ప, నజీర్‌, ఎంకే నాగరాజు, రామాంజనేయులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-15T05:53:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising