ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అథ్లెటిక్స్‌లో బుక్కపట్నం విద్యార్థిని ప్రతిభ

ABN, First Publish Date - 2022-09-11T05:28:34+05:30

గుంటూరు లోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన సౌతజోన జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో బుక్కపట్నం మండలం పాముదుర్తి గ్రామానికి చెందిన విద్యార్థిని ప్రత్యూష సత్తాచాటింది.

విద్యార్థిని ప్రత్యూష
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



బుక్కపట్నం, సెప్టెంబరు 10: గుంటూరు లోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన సౌతజోన జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో బుక్కపట్నం మండలం పాముదుర్తి గ్రామానికి చెందిన విద్యార్థిని ప్రత్యూష సత్తాచాటింది. గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు చెలిమిమోహన కుమార్తె చెలిమి ప్రత్యూష ముదిగుబ్బలోని ఎస్‌డీఆర్‌ఆర్‌ డిగ్రీకళాశాలలో  ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గుంటూరులో నిర్వహించిన సౌతజోన జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో అండర్‌-20 విభాగంలో లాంగ్‌జంప్‌లో బంగారు పతకం, 100 మీటర్ల పరుగుపందెంలో రజితపతకం సాధించింది. దీంతో పాముదుర్తి పాఠశాల పీడీ ప్రకాశరెడ్డి ప్రోత్సాహంతో అనేక సార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జాతీయ స్థాయిలో పోటీల్లో రాణించిందని తండ్రి మెహన తెలిపారు. ఈ క్రమంలో పాముదుర్తి జిల్లా పరిషత ఉన్నతపాఠశాల హెచఎం శివకుమార్‌, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినం దించారు. ప్రస్తుతం ప్రత్యూష హైదరాబాద్‌లో గచ్చిబౌలి స్టేడియంలో కోచలు రమేశ, నరేశ  ఆధ్వర్యంలో శిక్షణ పొందుతోంది.


Updated Date - 2022-09-11T05:28:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising