హంసవాహనంపై బుగ్గరామలింగేశ్వరుడు
ABN, First Publish Date - 2022-03-05T06:20:54+05:30
పట్టణంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్స వాల్లో భాగంగా స్వామివారు శుక్రవారం హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
తాడిపత్రిటౌన్, మార్చి4: పట్టణంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్స వాల్లో భాగంగా స్వామివారు శుక్రవారం హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పగలు వసం తోత్సవం, రాత్రికి స్వామివారి ఉత్సవమూర్తికి ప్రత్యేక అలం కరణ చేసి పూజలు చేశారు. అనంతరం హంసవాహనంపై పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొన్నారు.
Updated Date - 2022-03-05T06:20:54+05:30 IST