ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీటీపీ ఎడమ కాలువలో పడి విద్యార్థి మృతి

ABN, First Publish Date - 2022-01-25T05:58:30+05:30

మండలంలోని బేలోడు గ్రామం వద్ద సోమవారం సాయంత్రం బీటీపీ ఎడమ కాలువలో పడి 2వ తరగతి విద్యార్థి ఆకాష్‌ (8) మృతి చెందాడు.

విద్యార్థి ఆకాష్‌ మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


గుమ్మఘట్ట, జనవరి 24: మండలంలోని బేలోడు గ్రామం వద్ద సోమవారం సాయంత్రం బీటీపీ ఎడమ కాలువలో పడి 2వ తరగతి విద్యార్థి ఆకాష్‌ (8) మృతి చెందాడు. గ్రామానికి చెందిన నవీన, మీనాక్షి దంపతులకు ఇద్దరు కుమారులు ఆకాష్‌, చిరంజీవి ఉన్నారు. స్థానిక పాఠశాలలో ఆకాష్‌ 2, చిరంజీవి ఒకటో తరగతి చదువుతుండేవారు. ఈ నేపథ్యంలో ఆకాష్‌ సాయం త్రం పాఠశాల నుంచి ఇంటికి రాగానే.. తమ్ముడు చిరంజీవితో కలిసి ఆడుకుంటూ ఇంటి పక్కనే ఉన్న బీటీపీ ఎడమ కాలువ వద్దకెళ్లాడు. కాలువలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండగా ఆకాష్‌ కాలుజారి అందులో పడ్డాడు. తమ్ముడు చిరంజీవి ఇంటి వద్దకెళ్లి కుటుంబ సభ్యులకు తెలియజేసేలోగా ఆకాష్‌ దాదాపు 300 మీటర్ల మేర కాలువలో 14వ డిసి్ట్రబ్యూటరీ వద్దకు కొట్టుకెళ్లాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆకాష్‌ పడిన చోట కాలువలో గాలించినా లభించలేదు. 14వ డిసి్ట్రబ్యూటరీ సమీపంలో ఆ కాష్‌ శవమై కనిపించాడు. మృతదేహంపై పడి తల్లిదండ్రులు బోరున విలపించారు. విద్యార్థి మృతిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు గుమ్మఘట్ట పోలీసులు తెలిపారు.


Updated Date - 2022-01-25T05:58:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising