ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రానికి బీజేపీ ద్రోహం

ABN, First Publish Date - 2022-09-29T06:01:28+05:30

విభజన హామీలు అమలు చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు

మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైల్వేజోన లేదని అధికారులు తేల్చేశారు.. 

 దేశ  రక్షణ భేరి ముగింపు సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

అనంతపురం కల్చరల్‌, సెప్టెంబరు 28: విభజన హామీలు అమలు చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. దేశ రక్షణ భేరి ముగింపు కార్యక్రమాన్ని బుధవారం జిల్లాకేంద్రంలో నిర్వహించారు. గుత్తిరోడ్డులోని ఐదులైట్ల కూడలి నుంచి తాడిపత్రి బస్టాండు సర్కిల్‌ వరకు ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. తొలుత తాడిపత్రి బస్టాండ్‌ సర్కిల్‌లో గాంధీ విగ్రహానికి శ్రీనివాసరావు చేతులమీదుగా పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం సీపీఎం నగర 1వ కమిటీ కార్యదర్శి రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో శ్రీనివాసరావు మాట్లాడుతూ... రాష్ట్రానికి రైల్వే జోన ఇస్తామని విభజన సమయంలో కేంద్రం హామీనిచ్చిందని, ఇపుడు రైల్వే జోన ఇవ్వలేమని రెండు తెలుగురాష్ట్రాల సమావేశాల్లో అధికారులు ప్రకటించడం శోచనీయమన్నారు. కేంద్రప్రభుత్వ అనుమ తి లేకుండా అధికారులు ఇలాంటి ప్రకటన చేయగలరా..? అని ప్రశ్నించారు. దీనిపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన జిల్లాలకు ఇస్తామన్న బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీని ఇవ్వలేదని గుర్తుచేశారు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేకపోగా విశాఖలో ఉన్న ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్‌పరం చేసేందుకు కేంద్రం సిద్ధపడిందన్నారు. ఈ సమస్యలపై కేంద్రాన్ని నిలదీసేందుకు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు రెండూ ముందుకు రాకపోవడం దారుణమన్నా రు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు దడాల సుబ్బారావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రజలపై పన్నుల భారాలు మోపుతూ కార్పొరేట్‌ శక్తులకు మాత్రం రాయితీలిస్తోందని విమర్శించారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతున్నా దేశంలో పెట్రోభారాలు మాత్రం తగ్గలేదని తెలిపారు.  కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బాలరంగయ్య, జిల్లా కమిటీ సభ్యులు చంద్రశేఖర్‌రెడ్డి, ముష్కిన, వెంకటనారాయణ, సూర్యచంద్ర, రామాంజి, నగర నాయకులు వలి, ప్రకాష్‌, మసూద్‌, ప్రసాద్‌, ఎన్టీఆర్‌ శశీన, బాలకృష్ణ, డీవైఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా అధ్యక్షుడు పరమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-29T06:01:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising