ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రసవాలపై బాధ్యతగా వ్యవహరించండి

ABN, First Publish Date - 2022-06-29T05:34:32+05:30

ప్రసవాలపై ప్రత్యేక జాగ్రత్తలతో పాటు బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెకర్‌ నాగలక్ష్మి వైద్య సిబ్బందిని ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైద్య ఆరోగ్యశాఖపై కలెక్టర్‌ సమీక్ష 

అనంతపురం టౌన జూన 28: ప్రసవాలపై ప్రత్యేక జాగ్రత్తలతో పాటు బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెకర్‌ నాగలక్ష్మి వైద్య సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అధికంగా ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. మంగళవారం జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో వైద్యఆరోగ్య శాఖ పనితీరు, పథకాల అమలుపై కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ మండల స్థాయిలో వైద్యసేవలకు సంబంధించి చాలా బాధ్యతగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఆరోగ్య సేవలు మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మెరుగైన వైద్యసేవలు అందించేందుకు నాడునేడు కింద వసతులు కల్పించడం జరుగుతున్నాదన్నారు. మాతాశిశు మరణాలు జరగకూడదన్నారు. బాల్య వివాహాలు రక్తహీనత వంటి రుగ్మతులను అరికట్టే బాధ్యత కూడా వైద్య రంగంపై ఉందన్నారు. ఆస్పత్రులలో అందించిన వైద్యసేవల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసి పంపాలన్నారు. సమావేశంలో డీఎంహెచఓ డాక్టర్‌ విశ్వనాథయ్య, డీసీహెచఎ్‌స కృష్ణవేణి, డీఐఓ యుగంధర్‌, పోగ్రామ్‌ ఆఫీసర్లు సుజాత, చెన్నకేశవులు, భానుమూర్తి, నారాయణస్వామి, ఓబులు, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి, డెమోలు భారతి, త్యాగరాజు, అన్ని పీహెచసీల డాక్టర్లు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-29T05:34:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising