ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం

ABN, First Publish Date - 2022-05-22T06:36:57+05:30

పట్టణంలోని టీటీడీ కల్యాణమండపం వద్ద జాతీయ రహదారి పక్కన విలువైన భూమిని కొందరు కబ్జాకు యత్నించారు.

ప్రభుత్వ భూమిలో చదును చేస్తున్న ఆక్రమణదారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడ్డుకున్న తహసీల్దార్‌


పెనుకొండ రూరల్‌, మే 21: పట్టణంలోని టీటీడీ కల్యాణమండపం వద్ద జాతీయ రహదారి పక్కన విలువైన భూమిని కొందరు కబ్జాకు యత్నించారు. శనివారం ఎక్సాకవేటర్‌తో ఆ భూ మిని చదును చేస్తుండగా, సమాచారం అందుకున్న తహసీల్దార్‌ నాగరాజు వెంటనే రంగంలోకి దిగారు. ప్రభుత్వ భూమిలో అక్ర మంగా చేస్తున్న పనులు నిలిపివేశారు. టీటీడీ కల్యాణమండపం సమీపంలో జాతీయరహదారి పక్కన సర్వే నంబరు 194-1లో 11 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. ఇదివరలో తహసీల్దార్‌గా విధులునిర్వహించిన హసీనాసుల్తానా ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బో ర్డు ఏర్పాటు చేశారు. శనివారం పట్టణానికి చెందిన కొందరు ఆక్రమణదారులు ఎక్సాకవేటర్‌తో భూమి చదును పనులు చేపడుతున్నారు. సమాచారం అందుకున్న తహసీల్దార్‌ నాగరాజు స్థలం వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వ భూమిలో మీరు పనులు ఎందుకు చేస్తున్నారు? ఎవరు అనుమతి ఇచ్చారంటూ ఆక్రమణదారులను ప్రశ్నించారు. పంచాయతీ అనుమతివ్వడంతో పనులు చేపడుతున్నట్లు ఆక్రమణదారులు చెప్పుకొచ్చారు. దీంతో తహసీల్దార్‌, ఆక్రమణదారుల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వ భూమిలో ప నులు చేపట్టకూడదని, వేసుకున్న షెడ్డు నిర్మాణం సాయంత్రంలో పు తొలగించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంపై తహసీల్దార్‌ నాగరాజును వివరణ కోరగా, ప్రభుత్వ భూముల్లో ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే వారిపై కఠిన చర్య లు తీసుకుంటామన్నారు.  నగర పంచాయతీ కమిషనర్‌ వంశీకృష్ణ, చైర్మన ఉమర్‌ఫారూక్‌ను వివరణ కోరగా, ప్రభుత్వ స్థలంలో తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. 

Updated Date - 2022-05-22T06:36:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising