ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరసనలకు జడిసి.. ముందస్తు అరెస్టు

ABN, First Publish Date - 2022-12-10T00:28:53+05:30

జిల్లా ఇనచార్జ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కళ్యాణదుర్గం పర్యటన సందర్భంగా వైసీపీ అసమ్మతి నాయకులను, యాదవ సామాజికవర్గ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. కళ్యాణదుర్గంలోని వైసీపీ కార్యాలయంలో జిల్లా ఇనచార్జ్‌ మంత్రి అధ్యక్షతన శుక్రవారం ఆ పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి ఉష శ్రీచరణ్‌, ఎంపీ తలారి రంగయ్య, చిత్తూరు ఎంపీ గిడ్డప్ప, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య హాజరయ్యారు.

ఎంపీ వర్గీయుడు టైలర్‌ శీనును నిర్బంధించిన పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీసు భద్రత నడుమ ఇనచార్జి మంత్రి పర్యటన

కంబదూరు (కళ్యాణదుర్గం రూరల్‌), డిసెంబరు 9: జిల్లా ఇనచార్జ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కళ్యాణదుర్గం పర్యటన సందర్భంగా వైసీపీ అసమ్మతి నాయకులను, యాదవ సామాజికవర్గ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. కళ్యాణదుర్గంలోని వైసీపీ కార్యాలయంలో జిల్లా ఇనచార్జ్‌ మంత్రి అధ్యక్షతన శుక్రవారం ఆ పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి ఉష శ్రీచరణ్‌, ఎంపీ తలారి రంగయ్య, చిత్తూరు ఎంపీ గిడ్డప్ప, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య హాజరయ్యారు. పుంగనూరులో యాదవ సామాజిక వర్గానికి చెందిన రామచంద్ర యాదవ్‌పై ఇటీవల జరిగిన దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డికి నిరసనలు ఎదురవుతాయని పోలీసులు అప్రమత్తమయ్యారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన సీపీఐ పట్టణ కార్యదర్శి ఓంకార్‌ యాదవ్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు తిలక్‌ యాదవ్‌ను అరెస్టు చేశారు. ఎంపీ తలారి రంగయ్య వర్గీయులైన వైసీపీ నాయకులు దొడగట్ట సూరీ యాదవ్‌, టైలర్‌ శీనును గృహ నిర్బంధంలో ఉంచారు. మంత్రి ఉష శ్రీచరణ్‌కు, ఎంపీ తలారి రంగయ్య మధ్య విభేదాలు ఉన్నాయి. ఇనచార్జ్‌ మంత్రితో కలిసి కళ్యాణదుర్గంలోని మంత్రి ఉష శ్రీచరణ్‌ కార్యాలయానికి ఎంపీ తలారి రంగయ్య మొదటిసారి వచ్చారు. కానీ ఆయన దూరంగా ఉండటాన్ని గమనించిన పెద్దిరెడ్డి.. మంత్రి ఉష శ్రీచరణ్‌కు చెప్పారు. దీంతో ఆమె వెంటనే వెళ్లి రంగయ్యకు ఆహ్వానం పలికి, తన వెంట తీసుకొచ్చారు. అనంతరం అందరూ కలిసి సమావేశానికి వెళ్లారు. విలేకరులను లోపలకి వెళ్లనివ్వకుండా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.

Updated Date - 2022-12-10T00:29:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising