ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మురుగు మధ్యన అంగనవాడీ

ABN, First Publish Date - 2022-09-11T05:59:01+05:30

చిన్న చిన్న పిల్లలు. వాళ్లు రోగాల బారిన పడకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటి పిల్లలు వచ్చే అంగనవాడీ కేంద్రం ఏకంగా మురుగు నీటి కూపంలో ఉంది.

మురుగునీటి కూపంలో అంగనవాడీ కేంద్రం, చిన్నారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాడికి, సెప్టెంబరు 10: చిన్న చిన్న పిల్లలు. వాళ్లు రోగాల బారిన పడకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటి పిల్లలు వచ్చే అంగనవాడీ కేంద్రం ఏకంగా మురుగు నీటి కూపంలో ఉంది. ఇటీవలిగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని పిన్నేపల్లిలో అంగనవాడీ కేంద్రం చుట్టూ మురుగునీరు నిల్వ ఉండిపోయింది. అందులో దోమలు విపరీతంగా వృద్ధి చెందాయి. ఆ మురుగు నీటి మధ్యలో ఉన్న అంగనవాడీ కేంద్రంలోనే పిల్లలు రోజంతా ఉంటారు. దీంతో వారిని దోమలు కుట్టి, జ్వరాల బారిన పడే ప్రమాదం ఉంది. అంగనవాడీ కేంద్రం వద్ద సీసీ రోడ్డు పక్కన డ్రైనేజీ నిర్మించలేదు. దీంతో చిన్నపాటి వర్షం పడినా నీరంతా పాఠశాల చుట్టూ చేరుతోంది. ఇళ్లలోని మురికినీరు కూడా అక్కడికే వచ్చి చేరుతోంది. దీంతో కేంద్రానికి మూడువైపులా మురికినీరు నిల్వ ఉండి, ద్వీపకల్పాన్ని తలపిస్తోంది. అంగనవాడీ కేంద్రంలోకి వెళ్లాలంటే చిన్నారుల అవస్థలు వర్ణనాతీతం. మురుగు నీటిలో నడుచుకుంటూ వెళ్లాల్సిందే. పలుమార్లు జారిపడుతున్నారు. అయినా.. అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.


Updated Date - 2022-09-11T05:59:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising