అనంత అబ్బాయిలు అదుర్స్
ABN, First Publish Date - 2022-12-31T00:32:48+05:30
అనంతపురం అబ్బాయిలు అదరగొట్టారు. రాష్ట్రస్థాయి అండర్-14 హ్యాండ్‌బాల్ పోటీల్లో అనంతపురం బాలుర జట్టు విజేతగా అవతరించింది.
విజేత ట్రోఫీతో అనంతపురం బాలుర జట్టు
కదిరి అర్బన, డిసెంబరు 30: అనంతపురం అబ్బాయిలు అదరగొట్టారు. రాష్ట్రస్థాయి అండర్-14 హ్యాండ్‌బాల్ పోటీల్లో అనంతపురం బాలుర జట్టు విజేతగా అవతరించింది. స్థానిక జిల్లా పరిషత బాలికల ఉన్నత పాఠశాలలో రాష్ట్ర స్కూల్‌గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి పోటీలు శుక్రవారం ముగిశాయి. బాలుర విభాగ ఫైనల్లో అనంతపురం, విశాఖపట్నం జట్లు తలపడ్డాయి. అనంతపురం జట్టు విజేతగా ఆవిర్భవించింది. బాలికల విభాగంలో శ్రీకాకుళం జట్టు విజేతగా, విజయనగరం జట్టు రన్నర్‌పగా నిలిచాయి. విజేత జట్లకు డీఈఓ మీనాక్షి బహుమతులు అందజేశారు.
Updated Date - 2022-12-31T00:32:50+05:30 IST