ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల మధ్య చీలికలు పెట్టి రాజకీయంగా బలపడాలని BJP చూస్తోంది: Srinivasa Rao

ABN, First Publish Date - 2022-07-04T20:54:11+05:30

ప్రజల మధ్య చీలికలు పెట్టి రాజకీయంగా బలపడాలని బీజేపీ చూస్తోందని సీపీఎం నేత శ్రీనివాసరావు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం (Anantapuram): సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు (Srinivasa Rao) బీజేపీ (BJP)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ ప్రజల మధ్య చీలికలు పెట్టి రాజకీయంగా బలపడాలని చూస్తోందని ఆరోపించారు. ఇది తెలంగాణ (Telangana) కాదని, ఆంధ్ర రాష్ట్రం (Andhra Pradesh)లో బీజేపీ ఆటలు సాగవన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ (Modi) ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఐదేళ్ల తర్వాత వచ్చిన మోదీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీలతోపాటు ఏ ఒక్క హామీ ఇప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. ప్రత్యేక హోదా ప్రకటించని పక్షంలో మోదీ రాష్ట్రంలోకి అడుగు పెట్టే పరిస్థితి ఉండదన్నారు. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇవాళ ప్రధాని మోదీ ఏపీకి వచ్చిన సందర్భంగా వైసీపీ, టీడీపీలు ప్రత్యేక హోదాపై తమ వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీలానే వైసీపీ టీడీపీలు కూడా రాష్ట్రానికి ద్రోహం చేసినట్లు అవుతుందన్నారు. ప్రత్యేక హోదా కోసం పార్టీలకతీతంగా పోరాడుతామని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

Updated Date - 2022-07-04T20:54:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising