ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీట మునిగిన నగరం

ABN, First Publish Date - 2022-10-12T05:54:29+05:30

అనంతపురం జలమయమైంది. ఇందుకు భారీ వర్షాలు మాత్రమే కారణం కాదు.. భారీగా ఆక్రమణలు కూడా..! నగరం నానాటికీ విస్తరిస్తోంది.

నడిమివంకలో ట్రాఫిక్‌ జామ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంత సాగరం

వంకల ఆక్రమణే కారణం

అనంతపురం క్రైం, అక్టోబరు 11: అనంతపురం జలమయమైంది. ఇందుకు భారీ వర్షాలు   మాత్రమే కారణం కాదు.. భారీగా ఆక్రమణలు కూడా..! నగరం నానాటికీ విస్తరిస్తోంది. ఈ క్రమంలో శివారు ప్రాంతాల్లో కాలనీలు, వెంచర్లు భారీగా ఏర్పడ్డాయి. చాలాచోట్ల వంకలను ఆక్రమించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారు. డ్రైనేజీ వ్యవస్థను కూడా చాలాచోట్ల ఏర్పాటు చేయలేదు. దీంతో భారీ వర్షాలు కురిసిన సమయంలో అటు వర్షపు నీరు, ఇటు ముగురునీరు ముందుకు కదలడం లేదు. ఈ కారణంగా అనంత నగరంలోని ఆరో రోడ్డు నడిమివంక నుంచి ఆజాద్‌నగర్‌, హనుమాననగర్‌, ఇందిరానగర్‌, బ్రహ్మానగర్‌, రజకనగర్‌, గంగానగర్‌ తదితర లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి నీరు చేరడంతో బాధితులు అవస్థలు పడుతున్నారు. నడిమివంకలోని గంగమ్మ ఆలయం నీట మునిగింది. నడిమివంక మీదుగా ప్రయాణించేందుకు వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడ్డారు. 


రాకపోకలు బంద్‌

సోమనాథ్‌నగర్‌ బ్రిడ్జి వద్ద వంక పొంగి పొర్లడంతో అధికారులు రాకపోకలను నిలిపేశారు. సోమనాథ్‌నగర్‌, రంగస్వామినగర్‌, యువజన కాలనీకి మధ్యలో ఉన్న వంక, ఐదోరోడ్డు పెద్దమ్మ గుడికి హనుమానకాలనీ మధ్య వంకల్లో ఇదే పరిస్థితి నెలకొంది. నగరంలోకి రావాలంటే ఈ బ్రిడ్జిల మీదే రావాలి. దీంతో మంగళవారం సాయంత్రం వరకు ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. నడిమివంక చుట్టుపక్కల ప్రాంతాలు జలమయమయ్యాయి. రుద్రంపేట నుంచి ఆలమూరుకు వెళ్లే ప్రధాన రహదారిలో  వంక గట్టు తెగిపోవడంతో ఆ నీరంతా నడిమివంకకు చేరింది. వంక తెగిన ప్రాంతంలో బ్రిడ్జి నిర్మిస్తున్నారు. అక్కడ వంకదారిలో తాజాగా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. అక్కడ వైసీపీ నాయకుడు  ఓ భవనాన్ని నిర్మించారు. పక్కనే మరో వెంచర్‌లో భవనాలు నిర్మించారు. ఆ రెండిటి మధ్యలో వంక ప్రవహిస్తోంది. ఎక్స్‌కవేటర్‌ సాయంతో గంటల కొద్దీ పనిచేసినా మట్టి, రాళ్లు తొలగించడం కష్టంగా మారింది. అక్రమ నిర్మాణాల కారణంగానే ఇళ్లలోకి నీరు చేరుతోందని బాధిత ప్రజలు వాపోతున్నారు. రుద్రంపేట-ఆలమూరు రహదారిలో వంకపొర్లుతున్న ప్రాంతాన్ని ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి పరిశీలించారు. అక్రమ కట్టడాలు ఏ పార్టీవారివైనా తొలగించాలని అధికారులను ఆదేశించారు. 





Updated Date - 2022-10-12T05:54:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising