అనంత మెడికోలు ఆదర్శం
ABN, First Publish Date - 2022-12-15T00:10:37+05:30
అనంత వైద్యకళాశాల వైద్య విద్యార్థులు మరోసారి ఆదర్శంగా నిలిచారు. భారత రక్షణశాఖకు జాతీయ సేవా పథకం ద్వారా రూ.2,03,553లు విరాళం అందజేశారు.
రక్షణశాఖకు రూ.2.03 లక్షలు విరాళం
అనంతపురం టౌన, డిసెంబరు 14: అనంత వైద్యకళాశాల వైద్య విద్యార్థులు మరోసారి ఆదర్శంగా నిలిచారు. భారత రక్షణశాఖకు జాతీయ సేవా పథకం ద్వారా రూ.2,03,553లు విరాళం అందజేశారు. ప్రతి సంవత్సరం రక్షణశాఖలో పనిచేస్తూ ఘర్షణలు, ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన సైనికుల పిల్లలకు తమ వంతు సాయంగా విరాళా లు ఇస్తున్నట్లు పలువురు మెడికోలు పేర్కొన్నారు. ఈసారి కూడా పక్షం రోజులుగా విరాళాలు సేకరించారు. సేకరించిన సొమ్మును ప్రిన్సిపాల్ డాక్టర్ నీరజ చేతుల మీదుగా ఎనఎ్‌ఫసీహెచ సంస్థకు బుధవారం పంపించారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ వీరమరణం పొందిన సైనికుల పిల్లల సహాయార్థకం అనేక సంవత్సరాలుగా విరాళాలు సేకరించి పంపుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే వైద్యకళాశాల ఎనఎ్‌సఎ్‌స యూనిట్ ఆధ్వర్యంలో విరాళాలను ఈసారి సేకరించామన్నారు. భారతదేశంలో 5వేల విద్యా సంస్థల ద్వారా ఇప్పటి వరకు ఈ విరాళాలు వెళ్తున్నాయని అందులో ఇప్పటివరకు ఎప్పుడు లేనంత అధికంగా విరాళాలను అనంత వైద్య కళాశాల నుంచి పంపినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ సరోజ, డాక్టర్ ప్రవీణా, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ సునీల్, ఎనఎ్‌సఎ్‌స పోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ పరదేశినాయుడు మెడికోలు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T00:10:38+05:30 IST