ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశేష అలంకరణల్లో అమ్మవార్లు

ABN, First Publish Date - 2022-10-03T06:32:20+05:30

దసరా శరన్నవరాత్రు ల్లో భాగంగా ఏడోరోజు ఆదివారం జిల్లావ్యాప్తంగా అమ్మవారు విశేష అలంకరణల్లో భక్తులకు దర్శనమిచ్చారు.

హిందూపురంలోని ముద్దిరెడ్డిపల్లి చౌడేశ్వరి అమ్మవారికి శారదాదేవి అలంకరణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిందూపురం అర్బన, అక్టోబరు 2: దసరా శరన్నవరాత్రు ల్లో భాగంగా ఏడోరోజు ఆదివారం జిల్లావ్యాప్తంగా అమ్మవారు విశేష అలంకరణల్లో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణంలో బో యకొండ గంగమ్మ, వాసవీమాత, జలదుర్గమ్మ, కొల్హాపురమ్మ లక్ష్మీదేవి, నింకంపల్లి రోడ్డు యల్లమ్మ, నానెప్పనగర్‌ గాయత్రి  దేవతలను సరస్వతీ దేవిగా అలంకరించారు. పులమతిరోడ్డులో ని రాజరాజేశ్వరీ ఆలయంలో పూలు నగలతో కొలువుదీరారు.


లేపాక్షి: స్థానిక దుర్గావీరభద్రస్వామి ఆలయంలో అమ్మవా రు సరస్వతీ దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఎనిమిదో రో జు సోమవారం అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో దర్శనమివ్వనున్నట్లు అర్చకులు తెలిపారు.


గోరంట్ల: పట్టణంలోని వాసవీమాత, చౌడేశ్వరీదేవి, గుమ్మయ్యగారిపల్లి మారెమ్మ దేవతలను సరస్వతిదేవి అలంకరణలో ముస్తాబు చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని కొన సాగించారు.  


మడకశిర రూరల్‌: మండలంలోని నీలకంఠపురంలో పార్వతిదేవి శాకాంబరి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. పలు అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.


రొద్దం : మండలకేంద్రంలోని రుద్రపాదాశ్రమం, వెంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి, ఆర్‌ మరువపల్లిలోని కోన మల్లేశ్వరస్వామి, రేణుకా యల్లమ్మ ఆలయాల్లో పూజలు నిర్వహించారు. రేణుకా యల్లమ్మను సరస్వతిదేవిగా అలంకరించారు. 


పెనుకొండ: దస్థానిక లక్ష్మీ వెంకటరమణస్వామి ఆలయం లో స్వామివారిని కోదండరాముని రూపంలో, వాసవీకన్యకాపరమేశ్వరీ ఆలయంలో అమ్మవారిని సరస్వతి దేవిగా, కాళీమాత ఆలయంలో తమలపాకుల రూపంలో అలంకరించారు.


Updated Date - 2022-10-03T06:32:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising