ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేతనాల బిల్లులపై సందిగ్ధం!

ABN, First Publish Date - 2022-01-29T05:41:06+05:30

ప్రభుత్వోద్యోగులకు జనవరి వేతనాల బిల్లులు పాస్‌ చేయడంపై సందిగ్ధం నెలకొంది. కొత్త పీఆర్సీని రద్దు చేసి, తమకు పాత పద్ధతిలోనే వేతనాలివ్వాలని పీఆర్సీ సాధన సమితి నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాత విధానంలో బిల్లులు పెట్టేందుకు ఆప్షన తీసేసిన ప్రభుత్వం  

నూతన విధానంలో బిల్లులు పంపకుండా ఆపేసిన డ్రాయింగ్‌ ఆఫీసర్లు


అనంతపురం వ్యవసాయం, జనవరి 28:  ప్రభుత్వోద్యోగులకు జనవరి వేతనాల బిల్లులు పాస్‌ చేయడంపై సందిగ్ధం నెలకొంది. కొత్త పీఆర్సీని రద్దు చేసి, తమకు పాత పద్ధతిలోనే వేతనాలివ్వాలని పీఆర్సీ సాధన సమితి నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కొన్ని రోజులుగా నిరసనలు చేపడుతున్నారు. పాత విధానంలోనే బిల్లులు పెట్టేలా చర్యలు తీసుకోవాలని  ఖజానా డీడీ, జిల్లా యంత్రాంగానికి వి న్నవిస్తున్నారు. కొ త్త పీఆర్సీ మేరకు వేతనాల బిల్లులు పెట్టాలని ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఎక్కువైంది. జిల్లావ్యాప్తంగా 88వేల మంది దాకా ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. అ న్ని శాఖల్లో 1383 మంది దాకా డ్రాయింగ్‌ అధికారులు ఉ న్నట్లు సమాచారం. ఆయా శాఖల్లో డ్రాయింగ్‌ అధికారుల నుంచే ఉద్యోగులు, సిబ్బంది నెలవారీ వేతనాల బిల్లులు ఖజానా కార్యాలయానికి పంపుతారు. రివర్స్‌ పీఆర్సీపై జేఏసీ ఉద్యమంలో భాగంగా కొత్త పీఆర్సీ ప్రకారం ఇప్పటిదాకా డ్రాయింగ్‌ అధికారులు బిల్లులు పంపలేదు. పోలీసు శాఖ నుంచి కొత్త పీఆర్సీపై వెరిఫికేషన కోసం ఎస్‌ఆర్‌ల వివరాలు పంపినట్లు సమాచారం. ఆ శాఖ నుంచి ఇప్పటిదాకా వేతనాల బిల్లులు పెట్టలేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ కొత్త పీఆర్సీ మేరకే వేతనాల బిల్లులు పెట్టాలని డ్రాయింగ్‌, ఖజానా అధికారులపై ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. పాత విధానంలో బిల్లులు పెట్టేందుకు అవకాశం లేకుండా అందుకు సంబంధించిన ఆప్షనను ప్ర భుత్వం తీసేసింది. దీంతో డ్రాయింగ్‌ అధికారులు అయోమయంలో పడ్డారు. కొత్త  పీఆర్సీని వ్యతిరేకిస్తూ నిరసనలు కొసాగిస్తున్నా ప్ర భుత్వం మొండి వైఖరిని వీడటం లేదు. ప్రతినెలా 25వతేదీలోగానే ఆ నెలకు సంబంధించిన వేతనాల బిల్లులు పెడుతున్నారు. ఈ నెలలో ఆ సమయం మీరిపోయింది. ఈ పరిస్థితుల్లో జనవరి నెల వేతనాల బిల్లుల సంగతేంటో అంతుచిక్కట్లేదు.


Updated Date - 2022-01-29T05:41:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising