ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీపీ మండల్‌ విగ్రహ దిమ్మె కూల్చినవారిపై చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-10-02T04:59:40+05:30

గుం టూరులో బీపీ మండల్‌ విగ్రహ ఏర్పా టు కోసం నిర్మించిన దిమ్మెను కూల్చి న అధికారులపై సత్వరమే చర్యలు తీ సుకోవాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి డిమాండ్‌ చే శారు.

విలేకరులతో మాట్లాడుతున్న తిప్పేస్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి 


మడకశిరటౌన, అక్టోబరు 1: గుం టూరులో బీపీ మండల్‌ విగ్రహ ఏర్పా టు కోసం నిర్మించిన దిమ్మెను కూల్చి న అధికారులపై సత్వరమే చర్యలు తీ సుకోవాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి డిమాండ్‌ చే శారు. శుక్రవారం స్థానిక బాలాజీ నగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు, బ హిరంగ స్థలాల్లో వైఎ్‌సఆర్‌ విగ్రహాలు ఏర్పాటు చేయడానికి లేని అభ్యంతరం.. బీసీల అభ్యున్నతికి కృషి చేసిన బీపీ మండల్‌ విగ్ర హం ఏర్పాటుకు ఎందుకని ప్రశ్నించారు. వెనకబడిన బడుగు బలహీన వర్గాలకు విద్య, ఉద్యోగ, రిజర్వేషన్ల కోసం మార్గం సుగమం చే సిన గొప్పవ్యక్తి, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి బీపీ మండల్‌ అని కొ నియాడారు. ఆయన విగ్రహ ఏర్పాటుకు గుంటూరులో నిర్మించిన వి గ్రహ దిమ్మెను కూల్చడం అంటే రాష్ట్రంలో మూడు కోట్ల బీసీల ఆత్మగౌరవాన్ని కాలరాసినట్లేనని అన్నారు. జగన ప్రభుత్వం అధికారంలో కి వచ్చాక మూడేళ్లలో బీసీ నాయకులపై దాడులు, అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. బీసీ సబ్‌ప్లాన కార్పొరేషనలకు చెందిన రూ.30వేల కోట్లు దారి మళ్లించారని, ఇందుకు జగన ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ శ్రీ నివాసమూర్తి, జిల్లా మైనారిటీ అధ్యక్షులు భక్తర్‌ పాల్గొన్నారు. 


సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతికినివాళి

మడకశిర రూరల్‌: మండలంలోని వైబీ హళ్ళి గ్రామానికి చెంది న మాజీ జడ్పీటీసీ సభ్యులు కరుణాకర్‌ రెడ్డి కుమారుడు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వెంకటరంగారెడ్డి ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి, రాష్ట్రప్రధాన కార్యదర్శి శ్రీనివాసమూర్తి శనివారం గ్రామానికి వెళ్లి చిత్రపటానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు. వారి వెంట సర్పంచు రామాంజనేయులు, రవీంద్రారెడ్డి ఉన్నారు. 


Updated Date - 2022-10-02T04:59:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising