డ్వామా ఏపీఓల డెప్యుటేషన రద్దు
ABN, First Publish Date - 2022-12-15T00:14:17+05:30
డ్వామాలో మరో మతలబు జరుగుతోంది. ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన బెదిరింపులు..వసూళ్లు అనే కథనానికి డ్వామా అధికారులు స్పందించారు. అవసరం లేకుండా డ్వామా పీడీ కార్యాలయంలో డెప్యుటేషనపై పనిచేస్తున్న ఏపీఓలను యథా స్థానాలకు పంపారు
కొత్తవారిని తీసుకునే యోచనలో అధికారులు
ఈ తతంగంపై అనేక అనుమానాలు
అనంతపురం క్లాక్‌టవర్, డిసెంబరు14: డ్వామాలో మరో మతలబు జరుగుతోంది. ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన బెదిరింపులు..వసూళ్లు అనే కథనానికి డ్వామా అధికారులు స్పందించారు. అవసరం లేకుండా డ్వామా పీడీ కార్యాలయంలో డెప్యుటేషనపై పనిచేస్తున్న ఏపీఓలను యథా స్థానాలకు పంపారు. ఈ మేరకు డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆరుగురు ఏపీఓల్లో భాగ్యలక్ష్మిని పెద్దపప్పూరుకు, పోలేరయ్యను బుక్కరాయసముద్రం ఎంపీడీఓ కార్యాలయానికి, రమణారెడ్డిని బుక్కరాయసముద్రం ఏపీడీ కార్యాలయానికి, విజయభారతిని కళ్యాణదుర్గం క్లస్టర్ ఏపీడీ కార్యాలయానికి, పుల్లారెడ్డిని పెద్దవడుగూరుకి, మురళిని గార్లదిన్నెకు కేటాయించారు. ఇద్దరు ఏపీఓలను నగరానికి అతిసమీపంలో ఉన్న బుక్కరాయసముద్రానికి కేటాయించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేరుకే డెప్యుటేషన్ల రద్దు కొత్తవారిని డెప్యుటేషనపై పీడీ కార్యాలయానికి తీసుకురావడానికి ఉపక్రమిస్తున్నట్ల సమాచారం.
డ్వామాపై ఉన్నతాధికారుల ఆరా
డ్వామాలో జరుగుతున్న అవినీతి, అక్రమాల వ్యవహారాలపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన వరుస కథనాలపై జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాఽధికారులు రహస్యంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే డ్వామాపై జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులకు అనేక ఫిర్యాదులు అందజేశారని, వాటన్నింటిపై విచారణ జరిపి తమకు రహస్యంగా నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. రహస్యంగా విచారణ ఇప్పటికే చేపడుతున్నారని, విచారణ అధికారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచడం గమనార్హం. ఉపాధి పనుల్లో తప్పుడు మస్టర్లు, బోగస్ పనిదినాలు, కమిషన్లు, నేమ్‌బోర్డులు, వాటర్‌షెడ్ పనుల్లో నిధుల దుర్వినియోగం, ఏపీఓల అక్రమ డెప్యుటేషన్ల వంటి అంశాలపై సమగ్ర నివేదిక కోరినట్లు సమాచారం. ఈ విచారణ నివేదిక ఆధారంగా డ్వామా అధికారులపై చర్యలు తీసుకుంటారని ఆశాఖ అధికారులు చెబుతున్నారు.
Updated Date - 2022-12-15T00:14:18+05:30 IST