ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీకే పల్లిలో అధికారపార్టీకి షాక్‌

ABN, First Publish Date - 2022-08-12T05:54:59+05:30

మండలంలో అధికార వైసీపీకి పెద్దషాక్‌ తగిలింది. వైసీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీపీ కుమారుడు మాడెం సూర్యనారాయణరెడ్డి టీడీపీలోకి చేరారు.

టీడీపీలోకి చేరిన వారితో మాజీమంత్రి పరిటాలసునీత, యువనేత పరిటాలశ్రీరామ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీలో చేరిన మాడెం సూరి

మరో 30 కుటుంబాల చేరిక 

ఆహ్వానించిన మాజీమంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌

చెన్నేకొత్తపల్లి, ఆగస్టు 11: మండలంలో అధికార వైసీపీకి పెద్దషాక్‌ తగిలింది. వైసీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీపీ కుమారుడు మాడెం సూర్యనారాయణరెడ్డి టీడీపీలోకి చేరారు. ఆయనతోపాటు చెన్నేకొత్తపల్లి, వెంకటంపల్లి, ఎర్రంపల్లి, నాగసముద్రం తదితర గ్రామాల నుంచి మరో 30 కుటుంబాలు మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌ సమక్షంలో గురువారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి సునీత, శ్రీరామ్‌ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అధికార పార్టీ విధానాలు, ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుల నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ తాము టీడీపీలో చేరుతున్నామని నాయకులు పేర్కొన్నారు. వైసీపీ పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని, ఆ పార్టీ నాయకులు టీడీపీలోకి భారీగా చేరుతున్నారని పరిటాల సునీత, శ్రీరామ్‌ అన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీలోకి చేరుతున్న వారిని చూసి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశరెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని, వారిని సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తామని అన్నారు. కలిసికట్టుగా పనిచేస్తే రాప్తాడులో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకుడు ఎల్‌ నారాయణ చౌదరి, రామ్మూర్తినాయుడు, రంగయ్య, శ్రీసత్యసాయి జిల్లా ఉపాధ్యక్షుడు దండు ఓబుళేశు, కన్వీనర్‌ ముత్యాల్‌ రెడ్డి, తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి రామసుబ్బమ్మ, బీసీ సెల్‌ అధికార ప్రతనిధి ఎజ్జే శంకర్‌, టీఎనఎ్‌సఎ్‌ఫ రాప్తాడు అధ్యక్షుడు భార్గవ గౌడ్‌, తెలుగుయువత నాయకుడు బెస్త నాగార్జున, నాయకులు అంకే అమరేంద్ర, రామకృష్ణారెడ్డి, పసల పెద్దవెంకటరాముడు, న్యామద్దల కిష్టప్ప, హరినాథరెడ్డి, గేటు కిష్టప్ప, కోళ్ల సూరి, చెన్నకేశవులు గౌడ్‌, కాన శివారెడ్డి,  సుబ్బరాయుడు, ఏపీ శ్రీనివాసులు, శివ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-12T05:54:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising