ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదకరంగా తాత్కాలిక వంతెన

ABN, First Publish Date - 2022-07-04T06:02:49+05:30

మండలంలోని బూదిలి వద్ద చిత్రావతి నది పై తాత్కాలికంగా నిర్మించిన వంతెన ప్రమాదకరంగా మారింది. గ త యేడాది నవంబరులో కురిసిన భారీ వర్షాలకు చిత్రావతి పొంగి పొర్లడంతో నీటి ఉధృతికి వంతెన కొట్టుకుపోయింది.

చిత్రావతి నదిపై బూదిలి వద్ద నిర్మించిన తాత్కాలిక వంతెన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోరంట్ల, జూలై 3: మండలంలోని బూదిలి వద్ద చిత్రావతి నది పై తాత్కాలికంగా నిర్మించిన వంతెన ప్రమాదకరంగా మారింది.  గ త యేడాది నవంబరులో కురిసిన భారీ వర్షాలకు చిత్రావతి పొంగి పొర్లడంతో నీటి ఉధృతికి వంతెన కొట్టుకుపోయింది. చెన్నై, నెల్లూరు, కడప, చిత్తూరు తదితర ప్రాంతాల నుంచి బెంగళూరు, పెనుకొండవద్ద ఉన్న కియ పరిశ్రమలకు నిరంతరం సిమెంటు, వస్తు సామగ్రి తరలింపునకు భారీ యంత్రాలు ప్రతిరోజు అధిక సంఖ్యలో తరలి వె ళ్తుంటాయి. ఈవాహనాలు గోరంట్ల పట్టణం మీదుగా వెళ్లాల్సి ఉండ గా, ట్రాఫిక్‌ సమస్య ఏర్పడేది. దీన్ని గుర్తించిన పోలీసులు వాహనాలను దారి మళ్లించి సమస్య పరిష్కరించారు. అయితే ఈ వాహనా లు కదిరి రహదారిలోని రెడ్డిచెరువుకట్ట నుంచి పులేరు, బూదిలి మీ దుగా బెంగళూరు జాతీయ రహదారి మార్గంలో కలిసేలా చేశారు. ఈడబుల్‌ రోడ్డులోని బూదిలి వద్ద ఉన్న వంతెన నదీ ప్రవాహంతో దెబ్బతినడంతో ఎస్సీ భాగ్యరాజ్‌  ప్రాధాన్యత గుర్తించారు. వంతెన తెగిన వెంటనే పరిశీలించి చర్యలు చేపట్టారు. సుమారు రూ.5లక్షల తో తాత్కాలిక వంతెన పనులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించారు. అలాగే రూ.9 కోట్ల వ్యయంతో చిత్రావతిపై హైలెవెల్‌ బ్రిడ్జితో పాటు అనుబంధంగా చెక్‌డ్యామ్‌ నిర్మించి భూగర్భజల వనరులు అ భివృద్ధి పరచడానికి ప్రతిపాదనలు పంపారు. సాయిల్‌ టెస్టింగ్‌ తదితర పనులు పూర్తయ్యాయి. అయితే కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టాల్సిన వంతెన నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 40 శా తం నిధులు సమకూర్చాల్సి ఉంది. ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో వంతెన పనులు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా చి త్రావతి ప్రవహిస్తుండటంతో తాత్కాలిక వంతెన కొట్టుకుపోయే ప్ర మాదం లేకపోలేదు. ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరుచేసి వంతెనను పునర్నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. 


Updated Date - 2022-07-04T06:02:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising