ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడికెళ్లాలంటే 2 కి.మీ. నడవాల్సిందే..

ABN, First Publish Date - 2022-08-20T05:14:26+05:30

మండలంలోని వడ్డివారిపల్లి సమీపంలోని సాంఘిక సంక్షేమ శాఖ సమీకృత ఎస్సీ బాలుర వసతి గృహం విద్యార్థులు రోజూ బడికెళ్లాలంటే 2 కి.మీ. నడవాల్సిందే.

కాలినడకన పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓబుళదేవరచెరువు, ఆగస్టు 19: మండలంలోని వడ్డివారిపల్లి సమీపంలోని సాంఘిక సంక్షేమ శాఖ సమీకృత ఎస్సీ బాలుర వసతి గృహం విద్యార్థులు రోజూ బడికెళ్లాలంటే 2 కి.మీ. నడవాల్సిందే. బడి నుంచి హాస్టల్‌ చేరుకోవాలంటే మరో 2 కి.మీ. నడక తప్పదు. ఆ లెక్కన రోజూ వారు 4 కి.మీ. నడవాల్సి వస్తోందన్న మాట. హాస్టల్‌ విద్యార్థులు ఓబుళదేవరచెరువులోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలకు రావాలి. హాస్టల్‌ నుంచి పాఠశాల 2 కి.మీ. దూరం ఉంది. వసతి గృహంలో మొత్తం 60 మంది విద్యార్థులున్నారు. వీరిలో 5 నుంచి 7వ తరగతి వరకు చదివే 15 మందికి బస్సు పాసులున్నాయి. మిగిలిన 45 మంది విద్యార్థులు బస్సు పాస్‌ సౌకర్యం లేక రోజూ కాలినడకన బడికెళ్లాల్సిందే. నిత్యం 4 కి.మీ. నడక తప్పట్లేదు. విద్యార్థులు నడిచి వెళ్లే దారి కదిరి-హిందూపురం ప్రధాన రహదారి కావడంతో ప్రమాదాలకు ఆస్కారం ఉంది. రోడ్డు దాటే సమయంలో ప్రమాదాల బారిన పడే అవకాశం లేకపోలేదు. దీంతో భయంభయంగా బడికెళ్లాల్సి వస్తోంది.





Updated Date - 2022-08-20T05:14:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising