ఉత్తమ ఫలితాల సాధనకు 100 రోజుల ‘సంకల్పం’ : డీఈఓ
ABN, First Publish Date - 2022-12-16T00:12:17+05:30
పదో తరగతి 2022-23 పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి అనంత సంకల్పం పేరుతో 100 రోజులపాటు ప్రత్యేక అభ్యసన కార్యక్రమాలు రూపొందించినట్లు డీఈఓ వెంకటకృష్ణారెడ్డి, ఉమ్మడి జిల్లా సాధారణ పరీక్షల మండలి కార్యదర్శి లోకేశ్వర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
అనంతపురం విద్య, డిసెంబరు 15 : పదో తరగతి 2022-23 పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి అనంత సంకల్పం పేరుతో 100 రోజులపాటు ప్రత్యేక అభ్యసన కార్యక్రమాలు రూపొందించినట్లు డీఈఓ వెంకటకృష్ణారెడ్డి, ఉమ్మడి జిల్లా సాధారణ పరీక్షల మండలి కార్యదర్శి లోకేశ్వర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో కరోనా కారణంగా ప్రత్యక్ష బోధనకు దూరం కావడం, 100 మార్కుల ప్రశ్నాపత్రం తదితర కారణాల వల్ల 2021-22 ఏడాదిలో పది ఫలితాల్లో జిల్లా 49.70 శాతం సాధించిందన్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 14వ తేదీ వరకూ మొత్తం 8 రౌండ్లలో రెగ్యులర్ టైం టేబుల్‌కు ఆటంకం లేకుండా ఉదయం, సాయంత్రం, సెలవు దినాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Updated Date - 2022-12-16T00:12:19+05:30 IST