ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anantapur: పాఠశాలల విలీనంపై రోడ్డెక్కిన విద్యార్థుల తల్లిదండ్రులు

ABN, First Publish Date - 2022-07-05T17:41:31+05:30

పాఠశాలల విలీనంపై విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: పాఠశాలల విలీనంపై విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కారు. పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే ప్రభుత్వ తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పాఠశాలల విలీనం వల్ల సుదూర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు ఏవిధంగా వెళ్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయదుర్గం నియోజకవర్గం గలగల గ్రామ పాఠశాల ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. కణేకల్లు మండల కేంద్రంలో ఉన్న నేసేపేటలో ప్రాథమిక పాఠశాల విలీనాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు  వ్యతిరేకిస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు వెళ్లేటప్పుడు ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ మండిపడుతున్నారు.


అటు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలోని మేళాపురంలో పాఠశాల గేటుకు విద్యార్థుల తల్లిదండ్రులు తాళం వేసి నిరసనకు దిగారు. పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులను బయటకు పంపి ఆందోళన చేపట్టారు. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ముద్దిరెడ్డిపల్లి పాఠశాలలో విలీనం చేస్తే ఏవిధంగా వెళ్లాలంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-07-05T17:41:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising