ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anantapur: గొందిరెడ్డిపల్లికి చెందిన రైతు నూర్ మహ్మద్‌ అరెస్ట్

ABN, First Publish Date - 2022-07-09T15:51:13+05:30

జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం గొందిరెడ్డిపల్లికి చెందిన రైతు నూర్ మహ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం గొందిరెడ్డిపల్లికి చెందిన రైతు(Farmer) నూర్ మహ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితం నూర్ మహమ్మద్‌కు చెందిన పంపుసెట్లకు అధికారులు మీటర్లు బిగించారు. మోటార్ ఆన్ చేస్తే మీటర్ రీడింగ్ నమోదు అవుతుందంటూ నూర్ మహ్మద్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి దృష్టికి తీసుకు వచ్చారు. ప్రతి నెలా కరెంట్ బిల్లులు చెల్లించాలంటే రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయని నూర్ మహమ్మద్ ఆవేదన వ్యక్తం చేశాడు.


మరోవైపు  వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగింపు నిరసిస్తూ చలో గొందిరెడ్డిపల్లికి మాజీ మంత్రి పరిటాల సునీత(Parital sunita),  ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జి  పరిటాల శ్రీరామ్ (Paritala sriram) పిలుపునిచ్చారు. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌లను హౌస్ అరెస్ట్ చేశారు. నిరసనకు వెళ్ళకూడదంటూ నోటీసులు జారీ చేశారు. కాగా పోలీసుల నోటీసులపై పరిటాల శ్రీరామ్  మండిపడ్డారు. శాంతియుత నిరసనకు హౌస్ అరెస్టు ఏంటంటూ  శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-07-09T15:51:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising