ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి పోరాటాన్ని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిస్తారు: రామకృష్ణ

ABN, First Publish Date - 2022-02-28T18:44:34+05:30

మరావతి పోరాటాన్ని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిస్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సోమవారం అమరావతి పరిరక్షణ సమితి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి :  అమరావతి పోరాటాన్ని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిస్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  అన్నారు. సోమవారం అమరావతి పరిరక్షణ సమితి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అమరావతి రాజధాని పోరాటాన్ని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిస్తారని చెప్పారు. అమరావతిని ప్రస్తుతం రాజధానిగా కొనసాగుతుందంటే అమరావతి జేఏసీ పోరాటమే ప్రధాన కారణమన్నారు. సీఎం జగన్ ఇంటి దగ్గర నుంచి హెలిప్యాడ్‌కు వెళ్లాలంటే 500 మంది పోలీసులను పెట్టుకుంటున్నాడని మండిపడ్డారు. సెక్రటేరియట్‌కి పోవాలంటే 2వేల మంది పోలీసులు పెట్టుకుంటున్నాడన్నారు.మూడు రాజధానుల నిర్ణయంతోనే ఆయనకు సెక్యూరిటీ లేకుండా పోయిందన్నారు.జిల్లాల పునర్విభజనలో కొత్త జిల్లాలకు కేంద్ర స్థానంలో ఉన్న పట్టణాలను జిల్లా కేంద్రాలుగా పెడుతున్నారని చెప్పారు. అలాంటప్పుడు రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలి,  అమరావతిలోనే కదా అని రామకృష్ణ  అన్నారు. 


 అమరావతి రాజధానిని జగన్ ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం ఎవరికీ లాభం.. అందరికీ నష్టమేనని చెప్పారు. జగన్‌పై సీక్రెట్ ఓటింగ్ పెడితే ఆయన ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకంగా ఓటు వేస్తారని ఎద్దేవా చేశారు.  తమ ప్రభుత్వం తప్పు చేస్తుందని వారి ఎమ్మెల్యేలకు తెలుసునని అన్నారు.  జగన్‌రెడ్డి తాత దిగొచ్చినా అమరావతి రాజధాని మారదని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక్క ఫోన్ చేస్తే జగన్‌రెడ్డి  లేచి నిలుచుంటాడని దెప్పిపోడిశారు.అక్కడ అమరావతి లేదు,  ఇక్కడ పోలవరం లేదు.. మరి ఎందుకు జగన్ పరిపాలన అని రామకృష్ణ  ప్రశ్నించారు. 

Updated Date - 2022-02-28T18:44:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising