ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమలాపురం అల్లర్ల ఘటనలో మరో 20 మంది అరెస్ట్

ABN, First Publish Date - 2022-06-05T01:47:06+05:30

కోనసీమ జిల్లా పేరు మార్చొద్దంటూ గత నెల 24న చేపట్టిన ఆందోళన అదుపు తప్పి అల్లర్లు, విధ్వంసకర పరిస్థితులకు కారణమైన నిందితుల అరెస్టులు కొనసాగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: కోనసీమ జిల్లా పేరు మార్చొద్దంటూ గత నెల 24న చేపట్టిన ఆందోళన అదుపు తప్పి అల్లర్లు, విధ్వంసకర పరిస్థితులకు కారణమైన నిందితుల అరెస్టులు కొనసాగుతున్నాయి. అమలాపురం అల్లర్ల ఘటనలో మరో 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ ఘటనలో 112 మంది అరెస్ట్‌ చేశారు. అమలాపురం అల్లర్లు, విధ్వంసకర ఘటనలకు సంబంధించి ఏడు ఎఫ్‌ఐఆర్‌‌లు నమోదు చేశారు. ఈ కేసుల్లో నిందితుల గుర్తింపు కోసం ఏడు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు. నిందితులను సీసీ ఫుటేజ్‌, సోషల్‌ మీడియాలో చాటింగ్స్‌, వీడియో కెమెరాల ద్వారా నిందితుల గుర్తిస్తున్నారు. జిల్లాలో ఇంకా సెక్షన్‌ 30, 144 సెక్షన్లు అమలులో ఉంది.


తాజాగా మరికొన్ని మండలాల్లో ఇంటర్నెట్ సేవలు కొనసాగించారు. మొత్తం 12 మండలాల్లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అమలాపురం, అంబాజిపేట, అల్లవరం, అయినవిల్లి మండలాల్లో కొనసాగుతోన్న ఇంటర్నెట్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.  దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఇంట్లో నుంచి ఉద్యోగం చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల ఇక్కట్లకు గురవుతున్నారు. బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ సేవలకూ ఇబ్బంది ఎదురవుతోంది. ఈ పరిణామంపై ప్రజలు ప్రభుత్వంపై  మండిపడుతున్నారు. ఇంటర్నెట్ సేవలు ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియక ప్రజలు కాకినాడ, రాజమండ్రి వెళ్లిపోతున్న పరిస్థితి నెలకొంది. 

Updated Date - 2022-06-05T01:47:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising