ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amalapuram అల్లర్ల నిందితులపై పోలీసులు ఆరా

ABN, First Publish Date - 2022-05-25T21:56:50+05:30

అమలాపురం (Amalapuram) అల్లర్ల నిందితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అల్లర్లలో పాల్గొన్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం: అమలాపురం (Amalapuram) అల్లర్ల నిందితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అల్లర్లలో పాల్గొన్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. యువకుల ఫోన్లను, వైరల్ వీడియోలను పోలీసులు చెక్‌ చేస్తున్నారు. జిల్లా పేరును యథాతథంగా కొనసాగించాలంటూ ఈనెల 19 నుంచే ‘కోనసీమ జిల్లా పేరు సాధన సమితి’ పేరుతో కొందరు యువకులతో జేఏసీ ఏర్పాటైంది. ఎక్కువ మంది 30 నుంచి 40 ఏళ్లలోపు ఉన్న వారే. వాట్సాప్‌లో సమాచారం చేరవేసుకుంటూ ఉద్యమాలకు సిద్ధమయ్యారు. సోమవారం గ్రీవెన్స్‌ సెల్‌కు వెళ్లి వినతిపత్రాలు ఇవ్వాలనుకున్నా... పోలీసులు 144 సెక్షన్‌ పేరుతో ఇళ్లు కదలనీయలేదు. ఇలా తమను కట్టడి చేసి ఇబ్బంది పెడుతున్నారనే ఆగ్రహంతో మంగళవారం కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న వారి ఇంటింటికీ వెళ్లి గృహనిర్బంధం చేశారు. దీనిని ముందుగానే ఊహించిన కొందరు అమలాపురం పట్టణంలో ముందురోజే పలు హోటళ్లలో, బంధువుల ఇళ్లల్లో  బస చేశారు. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా అమలాపురంలోని పలు కూడళ్లలో ప్రత్యక్షమయ్యారు. 


బ్యాంకు కాలనీలో ఉన్న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ ఇంటిని వందలమంది నిరసనకారులు చుట్టుముట్టారు. మంత్రి ఇంటికి నిప్పంటించారు. అక్కడి నుంచి బయలుదేరిన ఆందోళనకారులు హౌసింగ్‌ బోర్డు కాలనీలో నివసిస్తున్న ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్‌ కుమార్‌ ఇంటిని లక్ష్యంగా చేసుకున్నారు. కింది భాగంలో ఉన్న ఆఫీసుతోపాటు ఇంటికి నిప్పంటించారు. ఎర్రవంతెన వద్ద ప్రయాణికులతో వెళుతున్న పల్లెవెలుగు, సూపర్‌ లగ్జరీ బస్సులను ధ్వంసంచేసి నిప్పుపెట్టారు. ఈ రెండు బస్సులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలు, రబ్బరు  బుల్లెట్లను ప్రయోగించారు. ఒకదశలో పోలీసులు కూడా నిరసనకారులపైకి రాళ్లు విసిరారు. రాళ్లదాడిలో సుమారు 20 మంది పోలీసులు గాయపడ్డారు. వారిని వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఉద్రిక్తతలు సాయంత్రం 6.30 గంటల దాకా కొనసాగాయి.

Updated Date - 2022-05-25T21:56:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising