ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పుణ్యభూమికి రావడం నా అదృష్టం’... తెలుగులో Modi ప్రసంగం

ABN, First Publish Date - 2022-07-04T17:59:38+05:30

అల్లూరి సీతారామరాజు(Alluri sitaramaraju) 125వ జయంతి వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి: అల్లూరి సీతారామరాజు(Alluri sitaramaraju) 125వ జయంతి వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) పాల్గొన్నారు. ఈ సందర్భంగా 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు.  మన్యం వీరుడు, తెలుగు జాతి యుగపురుషుడు అల్లూరి (Alluri) అని కొనియాడారు. అల్లూరి నడిచిన నేలపై మనం నడవడం అదృష్టమన్నారు. యావత్ భారతానికి అల్లూరి స్ఫూర్తిగా నిలిచారన్నారు.  ‘‘ఆంధ్రరాష్ట్రం పుణ్యభూమి... వీర భూమి. పుణ్యభూమికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’’ అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు.


రంప ఆందోళన ప్రారంభించి నేటికి వందేళ్లు పూర్తైందన్నారు. స్ఫూర్తి కోసమే ఆజాదీకా అమృత్ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మొగల్లులోని ధ్యానమందిరం, చింతపల్లి పీఎస్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. అల్లూరికి సంబంధించిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రధాని ప్రకటించారు. ఎందరో మహానుభావులు దేశం కోసం త్యాగాలు చేశారని, త్యాగధనులను స్మరించుకుని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. మన్యం వీరుడిగా ఆంగ్లేయులతో వీరోచితంగా పోరాడారని గుర్తుచేశారు. మనమంతా ఒకటేనన్న భావనతో ఉద్యమం జరిగిందని ప్రధాని తెలిపారు.


ఆదివాసీల బలిదానాన్ని ఇంటింటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఆనాడు బ్రిటిష్‌కు వ్యతిరేకంగా యువకులు పోరాడారని గుర్తుచేశారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం మరింత పెరగాలని అన్నారు. మన ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా దృష్టి సారించాలని తెలిపారు. అటవీ ప్రాంతంలో పెరుగుతున్న వెదురు కోతకు అవకాశం కల్పించామని, అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించామన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధిలో భాగంగా మన్యం జిల్లాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మాతృభాషలో విద్య కోసం 750 ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటయ్యాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-04T17:59:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising