ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలవరం ముంపు ప్రాంతాల్లో 16, 17 తేదీల్లో అఖిలపక్షం పర్యటన

ABN, First Publish Date - 2022-08-09T09:55:18+05:30

పోలవరం ముంపు ప్రాంతాల్లో ఈనెల 16, 17 తేదీల్లో అఖిలపక్ష బృందం పర్యటించనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సెప్టెంబర్‌లో పోలవరంలో దీక్షలు
  • నిర్వాసితులకు న్యాయం చేయాలని రౌండ్‌టేబుల్‌ సమావేశం డిమాండ్‌

అమరావతి (ఆంధ్రజ్యోతి)/విజయవాడ (ధర్నాచౌక్‌), ఆగస్టు 8: పోలవరం ముంపు ప్రాంతాల్లో ఈనెల 16, 17 తేదీల్లో అఖిలపక్ష బృందం పర్యటించనుంది. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేయాలని, నిర్వాసితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సెప్టెంబరులో పోలవరంలో దీక్షలు చేపట్టనుంది. సీపీఐ రాష్ట్రసమితి ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలో నిర్వహించిన అఖిల పక్షాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. పోలవరం బాధితులకు పునరావాస ప్యాకేజీ ఇవ్వకుండా ప్రాజెకు నిర్మించడం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం నిధులు, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీపై మోదీని జగన్‌ నిలదీయలేక పోతున్నారని మండిపడ్డారు.

Updated Date - 2022-08-09T09:55:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising