ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలాంటి గుడివాడలో విష సంస్కృతిని ప్రవేశపెట్టడం దారుణం: అక్కినేని వనజ

ABN, First Publish Date - 2022-01-27T17:35:45+05:30

గుడివాడలో నిర్వహించిన క్యాసినో నిర్వహణను ఖండిస్తూ సీపీఐ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడుతూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుడివాడ : గుడివాడలో క్యాసినో  నిర్వహణను ఖండిస్తూ సీపీఐ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడుతూ.. సాంస్కృతికంగా ప్రత్యేకమైన స్థానం ఉండి, ఎందరో మహనీయులను అందించిన గుడివాడలో విష సంస్కృతిని ప్రవేశపెట్టడం దారుణమన్నారు. సంస్కరణ వాదంతో విలువైన రాజకీయాలను అందించాల్సిన ప్రజాప్రతినిధులు, యువతను భ్రష్టు పట్టించేలా విదేశీ సంస్కృతిని అందిస్తున్నారన్నారు. ఎంతో విశిష్టత కలిగిన గుడివాడ సంస్కృతిపై దాడి చేస్తూ, విష సంస్కృతిని ప్రవేశపెట్టిన వారు ఎంతటి వారైనా అరెస్టు చేయాలన్నారు. గుడివాడలో నాంది పలికిన క్యాసినో సంస్కృతి భవిష్యత్తు రోజుల్లో మరిన్ని చోట్ల ప్రారంభమయ్యే ప్రమాదం ఉందన్నారు. అనాగరిక వ్యవస్థను ఆదిలోనే అడ్డుకునేలా క్యాసినో నిర్వాహకులపై తక్షణ చర్యలు తీసుకోవాలని అక్కినేని వనజ డిమాండ్ చేశారు.


Updated Date - 2022-01-27T17:35:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising