ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలాంటి ప్రచారాలను నమ్మొద్దు: మంత్రి సురేష్

ABN, First Publish Date - 2022-01-25T19:40:29+05:30

అలాంటి ప్రచారాలను నమ్మొద్దు: మంత్రి సురేష్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తప్పుడు ప్రచారం చేసే వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని మంత్రి అదిములపు సురేష్ హెచ్చరించారు. పాఠశాలలకు సెలవులంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, వైరల్ చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో పాఠశాలల్లో తరగతులు నిర్వహణ ప్రశాంతంగా జరుగుతుందని చెప్పారు. పాఠశాలలకు సెలవులు అంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేయడంపై విద్యాశాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని ఛానెల్స్ పేరుతో మార్ఫింగ్ చేసి బ్రేకింగ్ న్యూస్ అంటూ పాఠశాలలకు సెలవులు అంటూ మండిపడ్డారు. హాస్టల్ విద్యార్థులు ఇళ్లకు వెళ్ళండి అని కొందరు ప్రచారం చేయటాన్ని మంత్రి తప్పుపట్టారు. ఇటువంటి ప్రచారాలకు పాల్పడుతున్న వారు, వాటిని సోషల్ మీడియా ద్వారా వైరల్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ప్రచారాలను తల్లిదండ్రులు, విద్యార్థులు నమ్మవద్దన్నారు.   

Updated Date - 2022-01-25T19:40:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising